హైలైట్స్
- వచ్చే నెలలో చైనాలో Doogee V Max లాంచ్ కానుందని అంచనా
- 22,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత
- 32ఎంపి సెల్ఫీ కెమెరా, ఐపీ68 రేటింగ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వస్తోన్న Doogee V Max

Doogee కంపెనీ రానున్న రోజుల్లో రగ్డ్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ ని లాంచ్ చేయనుందని అంచనా వేస్తున్నారు. వీటిలో Doogee V Max ఫిబ్రవరిలో లాంచ్ కానుందని తెలుస్తోంది. చైనాకు చెందిన డూజీ కంపెనీ 22,000 ఎంఏహెచ్ బ్యాటరీతో Doogee V Max ఫోన్ ని తీసుకొస్తోంది. అయితే, Doogee V Max ఫోన్ యొక్క రిలీజ్ డేట్, ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
Doogee V Max స్మార్ట్ ఫోన్ 22,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇంకా ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఈ ఫోన్ లాంచ్ అయ్యాక, భారీ బ్యాటరీ కలిగిన ప్రపంచపు తొలి స్మార్ట్ ఫోన్ గా నిలవనుంది. దీంతో Oukitel WP19 (21,000mAh) ఫోన్ ని డూజీ వీ మ్యాక్స్ అధిగమించనుంది. GSMArena సమాచారం ప్రకారం, Doogee V Max బ్యాటరీ సాధారణ వాడకంపై 10 రోజుల వరకు నడుస్తుందని తెలుస్తోంది. ఇక స్టాండ్ బై మోడ్ లో 64 రోజుల పాటు నడుస్తుందట. ఈ ఫోన్ 27.3 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. అయితే ఈ ఫోన్ బరువు ఇంకా తెలియదు. కానీ, బరువు ఎక్కువే ఉంటుందని చెప్పవచ్చు.
Doogee V Max టైమ్‌లైన్
Doogee V Max స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీని ఇంకా కంపెనీ రివీల్ చేయలేదు. కానీ, ఫిబ్రవరి లో డూజీ కంపెనీ యొక్క ఫోన్లు, ట్యాబ్లెట్స్ లైనప్ లాంచ్ అవుతోందని సమాచారం. ఇకపోతే Doogee V Max స్మార్ట్ ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: క్లాసిక్ బ్లాక్, సన్‌షైన్ గోల్డ్, మూన్ షైన్ సిల్వర్.
Doogee V Max స్పెసిఫికేషన్స్ (రూమర్డ్)
Doogee V Max స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన కొంత సమాచారం నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీని ప్రకారం, ఈ ఫోన్ 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్షన్, నాచ్ డిజైన్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫోన్ కెమెరా విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్616 ఫ్రంట్ కెమెరా (90 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ) ఉంటుంది. 108ఎంపి శాంసంగ్ ప్రైమరీ సెన్సర్, 20ఎంపి సోని ఐఎంఎక్స్350 నైట్ విజన్ కెమెరా, 16ఎంపి అల్ట్రావైడ్ కెమెరా (130 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ) ఉంటాయి. అల్ట్రావైడ్ కెమెరా మ్యాక్రో షూటర్ గా కూడా పని చేస్తుంది. ఇక ఈ కెమెరాలకు తోడు రెండు ఫ్లాష్ లైట్స్, మరొక రెండు ఇన్ఫ్రారెడ్ నైట్ విజన్ లైట్స్ కుడివైపున ఉన్నాయి.
Doogee V Max ఫోన్ లో ఐపీ68/ఐపీ69 రేటింగ్, ఎంఐఎల్-ఎస్టీడీ-810హెచ్ సర్టిఫికేషన్స్, గూగుల్ ప్లే సపోర్ట్ తో కూడిన ఎన్ఎఫ్సీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 5జీ కనెక్టివిటీ, హై-రెజ్ ఆడియో స్టాండర్డ్స్ ఉన్నాయి. Doogee V Max లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉండనుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. ఫోన్ అప్‌గ్రేడ్స్ గురించి ఇంకా ఏ వివరాలు తెలియదు. ఇకపోతే ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వస్తోంది. ఈ ఫోన్ లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంటుంది.
Doogee V Max ఫోన్ ధరను ఇంకా కంపెనీ ప్రకటించలేదు. రానున్న రోజుల్లో ఈ ఫోన్ కి సంబంధించిన మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











