హైలైట్స్
- భారత్ లో లాంచైన Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ తో వచ్చిన Samsung Galaxy A23 డివైజ్
- భారత్ లో Samsung Galaxy A23 ప్రారంభ ధర రూ.22,999
Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ నేడు భారత్ లో లాంచైంది. ఈ ఫోన్ తో పాటు Samsung Galaxy A14 కూడా ఎంట్రీ ఇచ్చింది. Samsung Galaxy A23 గురించి చూస్తే, ఈ ఫోన్ లో వాటర్ డ్రాప్ నాచ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్, క్వాడ్ కెమెరా సెటప్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 5జీ కనెక్టివిటీ ఉన్నాయి.
Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
భారత్ లో Samsung Galaxy A23 ధర
Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ధర రూ.22,999 గా ఉంది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.24,999 గా నిర్ణయించారు. ఇక ఈ ఫోన్ ని ఎస్బీఐ, ఐడీఎఫ్సీ, జెస్ట్ మనీ పేమెంట్ ఆప్షన్స్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 క్యాష్‌బ్యాక్ లభించనుంది.
Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ మరియు పార్ట్నర్ స్టోర్స్, శాంసంగ్.కామ్ ఇతర ఆన్లైన్ షాపింగ్ సైట్స్ ద్వారా జనవరి 20 నుంచి సేల్ కి అందుబాటులో ఉంటుంది. శాంసంగ్.కామ్ పై లైవ్ కామర్స్ ద్వారా Samsung Galaxy A14 ఫోన్ ని జనవరి 18 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు.
Samsung Galaxy A23 స్పెసిఫికేషన్స్
- 6.6-inch FHD+ IPS LCD డిస్ప్లే
- Qualcomm Snapdragon 695 చిప్
- 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్
- 50ఎంపి క్వాడ్ కెమెరా సెటప్
- 13ఎంపి సెల్ఫీ కెమెరా
Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి. వాటర్ డ్రాప్ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ అందించారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి.
Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ పై 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి.
Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












