
ముంబైకి చెందిన లైగర్ మొబిలిటీ అనే ఈవీ స్టార్టప్ ఆటో ఎక్స్పో 2023 లో ఆటో బ్యాలన్సింగ్ టెక్నాలజీతో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. ఆ స్కూటర్ల పేర్లు: Liger X, Liger X+. ఇవి వరుసగా 60 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల రేంజ్ ని కలిగి ఉన్నాయి.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు మోడర్న్ ఫీచర్స్ తో వస్తున్నాయి. ఈ స్కూటర్లలో టర్న్-బై-టర్న్ నేవిగేషన్, ఎల్ఈడీ లైటింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. లైగర్ కంపెనీ 2023 ఆఖర్లో బుకింగ్స్ ని మొదలు పెట్టనుంది.
Liger X, Liger X+ సెల్ఫ్-బ్యాలన్సింగ్ స్కూటర్స్
Liger X, Liger X+ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆటో బ్యాలన్సింగ్ టెక్నాలజీతో ఆటో ఎక్స్పో 2023 లో లాంచ్ అయ్యాయి. ఈ ఫీచర్ వల్లన ఎలక్ట్రిక్ స్కూటర్లు వాటంతటవే స్టాండ్ అవసరం లేకుండా నిలబడతాయి. అలాగే తక్కువ స్పీడ్ లో ఉన్నప్పుడు బ్యాలన్సింగ్ కోసం రైడర్ తన కాలుని క్రింద పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్ బండిని రివర్స్ తీస్తున్నప్పుడు కూడా పని చేస్తుంది. ఈ ఫీచర్ ని విభిన్న స్ఠాయిల్లో కంట్రోల్ చేసుకోవచ్చు. స్కూటర్ అనుకున్న స్పీడ్ ని రీచ్ అయ్యాక ఫీచర్ ని ఆఫ్ చేసేయవచ్చు.
Liger X, Liger X+ ఎలక్ట్రిక్ స్కూటర్లలో లెర్నర్ మోడ్ కూడా ఉంటుంది. దీని సాయంతో, ఆటో బ్యాలన్సింగ్ టెక్నాలజీ యాక్టివ్ గా ఉండే స్పీడ్ వరకు బండి వేగాన్ని లాక్ చేయవచ్చు. దీంతో కొత్తగా బండిని నేర్చుకునే వారికి ఇది ఎంతో ఉపయోగపడనుంది.
Liger X, Liger X+ ఎలక్ట్రిక్ స్కూటర్లు లిథియమ్-అయాన్ బ్యాటరీ ప్యాక్ తో వస్తున్నాయి. స్టాండర్స్ వేరియంట్ అయిన Liger X రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది. 3 గంటల్లో ఈ బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవుతుంది. ఇకపోతే ఈ బండి 65 కేఎంపీహెచ్ అత్యధిక వేగం వెళ్తుంది. Liger X రేంజ్ 60 కిలోమీటర్లు.
మరోవైపు Liger X+ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది. ఇది 4.50 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. ఈ బండి రేంజ్ 100 కిలోమీటర్లు.
Liger X, Liger X+ ఎలక్ట్రిక్ స్కూటర్లలో లేటెస్ట్ కనెక్టెడ్ వెహికిల్ ఫీచర్స్ ఉన్నాయి. కంపానియన్ స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా ఈ ఫీచర్లను ఎనేబుల్ చేయవచ్చు. లైవ్ లొకేషన్ ట్రాకింగ్, బ్యాటరీ టెంపరేచర్ ఇండికేటర్, టోయింగ్, యాక్సిడెంట్ అలర్ట్స్ రెండు స్కూటర్లలో ఉన్నాయి.
అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్స్, టెలీస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, ఎల్ఈడీ లైటింగ్, ఎంఐడీ వంటి ఫీచర్లు రెండు స్కూటర్లలో ఉన్నాయి. ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు గ్రే, పోలార్ వైట్, బ్లూ, టైటానియమ్, రెడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి. 2023 ద్వితీయార్థం నుంచి ఈ స్కూటర్ల బుకింగ్స్ మొదలవుతాయి. డెలివరీలు సంవత్సరాంతం నుంచి ప్రారంభమవుతాయి. ఇకపోతే Liger X, Liger X+ స్కూటర్స్ ధరలు ఎంతో ఇంకా తెలియదు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











