Reno8T లాగా ఉన్న కొత్త ఫోన్‌ని టెస్ట్ చేస్తోన్న OPPO; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం

Highlights

  • CPH2527 అనే మోడల్ నంబర్ తో ఉన్న కొత్త ఫోన్ ని టెస్ట్ చేస్తోన్న OPPO సంస్థ
  • OPPO Reno8 T 5G మాదిరి ఉన్న కొత్త ఫోన్ డిజైన్
  • 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 108ఎంపి మెయిన్ కెమెరాతో వచ్చిన OPPO Reno8 T 5G

 

ఇటీవలె OPPO Reno8 T 5G స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసిన ఒప్పో సంస్థ రానున్న రోజుల్లో ఇదే ఫోన్ ని పోలి ఉన్న మరొక ఫోన్ ని తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజీలో ఉన్న ఈ ఫోన్ CPH2527 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ కర్వ్డ్ డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రానుందని సమాచారం. అయితే, రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

ఒప్పో సంస్థ త్వరలోనే ఈ కొత్త హ్యాండ్సెట్ ని భారత్ లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఫోన్ పేరు, స్పెసిఫికేషన్స్, ఫీచర్లు, ధర తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ముందు ఈ డివైజ్ పేరు బయటకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత నిదానంగా ఇతర వివరాలు తెలియనున్నాయి.

OPPO Reno8 T 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

రెనో-సిరీస్ లో వచ్చిన లేటెస్ట్ ఫోన్ ఇది. ఈ హ్యాండ్సెట్ పంచ్-హోల్ కటౌట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. బ్యాక్ ప్యానెల్ పై ఒప్పో గ్లో డిజైన్ ఉండటం వల్లన ఫోన్ కి మరింత ఆకర్షణ వచ్చింది. బ్యాక్ ప్యానెల్ ఫింగర్ ప్రింట్ ప్రూఫ్ అని కంపెనీ చెబుతోంది. 93 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, కర్వ్డ్ ఎడ్జెస్ ని ఫోన్ కలిగి ఉంది.

OPPO Reno 8T 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ ఎడ్జెస్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాన్ 695 చిప్సెట్ వాడారు. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 40x micro-lens ఉంటాయి. ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. OPPO Reno 8T 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.29,999 గా ఉంది. ఈ హ్యాండ్సెట్ సన్‌రైజ్ గోల్డ్, మిడ్నైట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో వచ్చింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleSnapdragon 8 Gen 3 తో లాంచ్ కానున్న Realme GT 3 చైనా వేరియంట్?
Next articleమార్చి 10 నుంచి Netflix లో స్ట్రీమ్ కానున్న ‘రానా నాయుడు’
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.