రూ.89 కి హోమ్-మేడ్ ఫుడ్‌ని డెలివరీ చేయనున్న Zomato

Highlights

  • హోమ్-మేడ్ ఫుడ్ ని ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పిస్తోన్న Zomato
  • ఇంటి వద్దే వండి డెలివరీ ఎగ్జిక్యూటివ్ కి అందించనున్న చెఫ్, మీల్స్ ధర రూ.89 నుంచి ప్రారంభం
  • ప్రస్తుతం ఈ సేవలు గురుగ్రామ్ నగరానికి మాత్రమే పరిమితం, త్వరలోనే దేశ వ్యాప్తంగా అందించే అవకాశం

Zomato Everyday: పాపులర్ ఫుల్ డెలివరీ యాప్ జొమాటో సరికొత్త సర్వీస్ జొమాటో ఎవ్రీడే ని ప్రారంభించింది. ఈ సేవల ద్వారా కస్టమర్లు నేరుగా చెఫ్ ఇంటి వద్ద వండిన ఆహారాన్ని ఆర్డరు చేసుకోవచ్చు. చెఫ్‌లు రెస్టారెంట్ వద్ద కాకుండా తమ ఇంటి వద్దే వండటం ఇక్కడ విశేషం. ఇంటి భోజనం తినేందుకు ఇష్టపడే వారికి ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

జొమాటో ఎవ్రీడీ ద్వారా, తన కస్టమర్లకు హోమ్ కుక్డ్ మీల్స్ అందించాలని కంపెనీ భావిస్తోంది. ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాతే ఆహారాన్ని తయారుచేయడం జరుగుతుంది. సరే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Zomato Everyday అంటే ఏమిటి?

జొమాటో కంపెనీ తీసుకొచ్చిన జొమాటో ఎవ్రీడే అనే కొత్త సర్వీస్ ద్వారా తాజాగా వండిన భోజనాన్ని అందుబాటు ధరలో అందించబడుతుంది. ఒక్క భోజనం ధర రూ.89 నుంచి మొదలవుతుంది. ఆర్డరు చేసిన పదార్థాలను బట్టి ధరలో మార్పు ఉంటుంది. ప్రతీ చెఫ్ కూడా అత్యంత నాణ్యమైన పదార్థాలను ఉపయోగించి వండిన రుచి శుచి కలిగిన భోజనం వినియోగదారుకి అందజేయబడుతుందని కంపెనీ చెబుతోంది.

త్వరలోనే ఈ ఆప్షన్ తమ తమ జొమాటో యాప్ లో ఎంపిక చేయబడిన ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తుంది. ఎవ్రీడే సెక్షన్ లో చెఫ్ మరియు ఆహారానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. యూజర్లు తమకు కావాల్సిన మీల్ ని ఎంచుకొని, తమ అభీష్టం మేరకు మార్పులు చేర్పులు చేసుకొని ఆర్డరు చేయవచ్చు. ఒక్కసారి ఈ ప్రక్రియ పూర్తయితే, ఆర్డరు అందుకున్న చెఫ్ వండటం మొదలుపెడతారు. తర్వాత భోజనాన్ని జొమాటె డెలివరీ ఎగ్జిక్యూటివ్ కి అందిస్తారు. సదరు డెలివరీ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ కి ఆర్డర్ ని అందజేస్తారు.

ఆర్డరు 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో కస్టమర్ కి డెలివరీ అవుతుందని జొమాటో చెబుతోంది. సమయానుసారం మెను లోని పదార్థాలు మారుతుంటాయి. లంచ్ విషయానికి వస్తే, 3.30 గంటలకు క్లోజ్ అవుతుంది.

Zomato Everyday ఎక్కడ అందుబాటులో ఉంది?

జొమాటో ఎవ్రీడే గురుగ్రామ్ లోని ఎంపిక చేయబడిన ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రాంతం, చెఫ్స్ ని బట్టి.. ఈ సేవలను విస్తరింపజేయాలని జొమాటో భావిస్తోంది. త్వరలోనే ఇతర నగరాలకు కూడా ఈ సేవలు రావాలని ఆశిద్దాం.

జొమాటో ఎవ్రీడే తో పాటు Zomato Gold అనే కొత్త సబ్‌స్క్రిప్షన్ ని జొమాటో లాంచ్ చేసింది. ఈ సర్వీస్ ఇంట్రడక్టరీ ప్రైస్ నెలకు రూ.149 గా ఉంది. గోల్డ్ మెంబర్షిప్ ద్వారా 10 కిలోమీటర్ల పరిధిలోని ఏ రెస్టారెంట్ నుంచైనా ఉచిత డెలివరీ పొందవచ్చు. అయితే బెనిఫిట్ పొందాలంటే మినిమమ్ ఆర్డర్ రూ.199 ఉండాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleలీకైన Realme GT Neo 5 SE డిస్ప్లే, కెమెరా స్పెసిఫికేషన్స్
Next article4GB ర్యామ్, UniSoC T606 ప్రాసెసర్ తో వస్తోన్న Tecno Spark 10C
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.