
ఎన్నో లీక్స్, రూమర్ల అనంతరం చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ Xiaomi తన ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 13 సిరీస్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో Xiaomi 13, Xiaomi 13 Pro, Xiaomi 13 Lite స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. Xiaomi 12 Pro కి సక్సెసర్ గా Xiaomi 13 Pro వచ్చింది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో Xiaomi 13 Pro మార్కెట్ లోకి వచ్చింది.
Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ గతేడాది చైనాలో లాంచైంది. కొన్ని నెలల తర్వాత ఈ డివైజ్ భారత్ కి వచ్చింది. సరే, ఓసారి Xiaomi 13 Pro యొక్క భారత మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.
Xiaomi 13, Xiaomi 13 Pro, Xiaomi 13 Lite ఫోన్ల ధరలు, లభ్యత
Xiaomi 13, Xiaomi 13 Pro ఫోన్ల ధరలు వరుసగా 999 యూరోలు (సుమారు రూ.87,585), 1299 యూరోలు (సుమారు రూ.1,13,887) తో ప్రారంభం కానున్నాయి. Xiaomi 13 Lite ధర 499 యూరోలు (సుమారు రూ.43,748) తో ప్రారంభమవుతుంది. Xiaomi 13 Pro డివైజ్ కేవలం కంపెనీ అధికార వెబ్ సైట్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. Xiaomi 13 Pro యొక్క భారత మార్కెట్ ధర, లభ్యత తదితర వివరాలు ఫిబ్రవరి 28 న రివీల్ కానున్నాయి.
Xiaomi 13 Pro డిజైన్, కలర్ ఆప్షన్స్
Xiaomi 13 Pro 5G అల్ట్రా స్లిమ్ బాడీ కలిగి ప్రీమియమ్ డిజైన్ తో వచ్చింది. మెటల్ ఫ్రేమ్, గ్లాస్ శాండ్విచ్ డిజైన్ ప్రతీ యాంగిల్ లోనూ ఉత్తమంగా కనిపిస్తోంది. ఈ హ్యాండ్సెట్ పంచ్-హోల్ డిజైన్, బెజెల్-లెస్ డిస్ప్లే ని కలిగి ఉంది. సిరామిక్ బ్లాక్, సిరామిక్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
Xiaomi 13 Pro స్పెసిఫికేషన్స్
Xiaomi 13 Pro లో 6.78-ఇంచ్ 2కే ఫ్లెక్సిబుల్ ఈ6 అమోలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, డాల్బి విజన్ సపోర్ట్ ఉన్నాయి. కెమెరా విభాగం చూస్తే, ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 1-ఇంచ్ సెన్సర్, 50ఎంపి టెలీఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్), 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా (మ్యాక్రో మోడ్ తో) ఉన్నాయి. 32ఎంపి సెల్ఫీ కెమెరాను ఈ ఫోన్ లో అందించారు.
Xiaomi 13 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఈ ఫోన్ అందించారు. Xiaomi 13 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 4820 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Xiaomi 13 Pro లో 5జీ, 4జీ, వై-ఫై 7, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.3, డ్యూయల్ స్పీకర్స్, డాల్బి అట్మాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











