
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung గత నెలలో భారత మార్కెట్ లో Samsung Galaxy A14 5G ఫోన్ ని అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఈ సంస్థ Samsung Galaxy A14 4G ఫోన్ ని మలేషియాలో లాంచ్ చేసింది. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అయిన Samsung Galaxy A14 4G లో మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ వాడారు. ఈ స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది.
Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ లో భారీ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా అందించారు. 13ఎంపి సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. సరే, ఓసారి Samsung Galaxy A14 4G యొక్క ధర, లభ్యత, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A14 4G ధర, లభ్యత
Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వచ్చింది. ఈ హ్యాండ్సెట్ మలేషియా వెబ్ సైట్ లో కనిపిస్తోంది. అయితే, కంపెనీ ఇంకా Samsung Galaxy A14 4G యొక్క ధరను రివీల్ చేయాల్సి ఉంది.
Samsung Galaxy A14 4G డివైజ్ భారత మార్కెట్ లభ్యతపై శాంసంగ్ ఇంకా ప్రకటన చేయలేదు. అయితే, ఇప్పటికే ఈ ఫోన్ BIS సర్టిఫికేషన్ పొందింది. దీంతో రానున్న కొన్ని రోజుల్లో భారత్ లో Samsung Galaxy A14 4G లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.
Samsung Galaxy A14 4G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
Samsung Galaxy A14 4G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 480 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. సెల్ఫీ షూటర్ ని వాటర్ డ్రాప్ నాచ్ లో ఇచ్చారు. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ80 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ52 జీపీయూ వినియోగించారు. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ తో ఈ ఫోన్ వచ్చింది. Samsung Galaxy A14 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Samsung Galaxy A14 4G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. అలాగే సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
Samsung Galaxy A14 4G డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. యూఎస్బీ 2.0 టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ని ఈ ఫోన్ లో అందించారు. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటుంది.
Samsung Galaxy A14 4G బ్లాక్, సిల్వర్, డార్క్ రెడ్, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 167.7 ఎంఎం పొడవు, 78.0 ఎంఎం వెడల్పు, 9.1 ఎంఎం మందం, 201 గ్రాముల బరువు ఉంటుంది. డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











