నేడే OnePlus 11R ఫస్ట్ సేల్

Highlights

  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 16జిబి ర్యామ్ తో లాంచైన OnePlus 11R
  • 1.5కే కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ హైలైట్స్
  • నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా OnePlus 11R ఫస్ట్ సేల్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OnePlus గత నెలలో భారత్ లో OnePlus 11R డివైజ్ ని లాంచ్ చేసింది. ఫిబ్రవరి 21 నుంచి ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉంది. నేడు మొదటిసారిగా ఈ ఫోన్ భారత్ లో సేల్ కి వచ్చింది. OnePlus 11R కొనాలని భావించే వారు అమెజాన్ ద్వారా ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ని ఆర్డర్ చేయవచ్చు.

OnePlus 11R క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది. ఈ ఫోన్ లో అలర్ట్ స్లైడర్ ఉండటం విశేషం. సరే, ఓసారి భారత్ లో OnePlus 11R ధర ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.

భారత్ లో OnePlus 11R ధర, లాంచ్ ఆఫర్లు, లభ్యత

OnePlus 11R స్మార్ట్ ఫోన్ 8జిబి + 128జిబి, 16జిబి + 256జిబి వేరియంట్స్ లో లభిస్తుంది. 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది. 16జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.44,999 గా ఉంది. వన్‌ప్లస్ స్టోర్ మరియు అమెజాన్ వెబ్ సైట్ ద్వారా నేడు (ఫిబ్రవరి 28) మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

OnePlus 11R స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉన్నాయి. ఈ డివైజ్ 16జిబి ర్యామ్ + ర్యామ్ వీటా టెక్నాలజీతో వచ్చింది. 120 హెర్ట్జ్ సూపర్ ఫ్లూయిడ్ డిస్ప్లే, 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1000 హెర్ట్జ్ టచ్ రెస్పాన్స్ రేట్‌ని ఈ ఫోన్ లో అందించారు.

OnePlus 11R 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరాలతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ షూటర్ ఇచ్చారు.

OnePlus 11R 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. OnePlus 11R 5G డివైజ్ సోనిక్ బ్లాక్, గెలాక్టిక్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OnePlus 11R 5G లో 5జీ, 4జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. OnePlus 11R 5G డివైజ్ 163.1 మిల్లీ మీటర్ల పొడవు, 74.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.53 మిల్లీ మీటర్ల మందం, 205 గ్రాముల బరువు ఉంటుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. డాల్బి అట్మాస్, అలర్ట్ స్లైడర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleMediaTek Helio G80 చిప్సెట్, 5000mAh బ్యాటరీతో లాంచైన Samsung Galaxy A14 4G
Next articleరివీలైన Xiaomi 13 Pro భారత మార్కెట్ ధర
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.