MediaTek Helio G99 చిప్, 120Hz AMOLED డిస్ప్లేతో లాంచైన Vivo V27e

Highlights

  • మలేషియాలో లాంచైన Vivo V27e స్మార్ట్ ఫోన్
  • 64ఎంపి ఓఐఎస్ కెమెరా, ఆరా లైట్ తో వచ్చిన Vivo V27e డివైజ్
  • ల్యావెండర్ పర్పుల్, గ్లోరీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Vivo V27e

Vivo సంస్థ నేడు భారత్ లో Vivo V27, Vivo V27 Pro డివైజెస్ ని లాంచ్ చేసింది. అయితే మలేషియాలో Vivo V27e స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది వివో. ఈ ఫోన్ భారత మార్కెట్ కి రాలేదు. త్వరలోనే భారత్ లో కూడా ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి వివో నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Vivo V27e డివైజ్ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆరా లైట్, 32 ఎంపి ఫ్రంట్ కెమెరా, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఐపీ54 రేటింగ్, 256జిబి స్టోరేజీ తో ఈ ఫోన్ వచ్చింది. సరే, ఓసారి Vivo V27e పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V27e ధర, లభ్యత

Vivo V27e స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర మలేషియాలో RM 1,299 (సుమారు రూ.24,000) గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ మలేషియాలో మాత్రమే అందుబాటులో ఉంది. భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు.

Vivo V27e స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Vivo V27e స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ (2400*1080 పిక్సెల్) రెజుల్యూషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 6.62-ఇంచ్ డిస్ప్లే, పంచ్-హోల్ నాచ్ ఉంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వినియోగించారు. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.

Vivo V27e డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత, ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. Vivo V27e లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా ఓఐఎస్ సపోర్ట్ కలిగి ఉంది. దీనికి తోడు 2ఎంపి మ్యాక్రో, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఆరా లైట్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం Vivo V27e లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Vivo V27e లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.టైప్ సీ పోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, ఐపీ54 రేటింగ్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Vivo V27e రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: ల్యావెండర్ పర్పుల్, గ్లోరీ బ్లాక్. Vivo V27e గ్లోరీ బ్లాక్ వేరియంట్ 162.51 ఎంఎం పొడవు, 75.81 ఎంఎం వెడల్పు, 7.70 ఎంఎం మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది. ల్యావెండర్ పర్పుల్ కలర్ వేరియంట్ 162.51 ఎంఎం పొడవు, 75.81 ఎంఎం వెడల్పు, 7.80 ఎంఎం మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo V27e లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.