
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme రీసెంట్ గా MWC 2023 ఈవెంట్ లో Realme GT 3 డివైజ్ ని లాంచ్ చేసింది. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ని ఈ ఫోన్ లో అందించారు. ఇదిలా ఉంటే, మరొక స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు Realme సిద్ధమవుతోంది. RMX3700 అనే మోడల్ నంబర్ కలిగిన డివైజ్ ఒకటి 3C సర్టిఫికేషన్ పై కనిపించింది. ఇది Realme GT Neo 5 SE లేదా Realme GT Neo 5 Lite అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు.
3C సర్టిఫికేషన్ పొందిన Realme GT Neo 5 SE
Realme GT Neo 5 SE డివైజ్ 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. ఈ ఫోన్ RMX3700 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5జీ కనెక్టివిటీతో వస్తోంది. 5జీ సపోర్ట్, ఫాస్ట్ చార్జింగ్ సమాచారం తప్పితే Realme GT Neo 5 SE కి సంబంధించిన మరే ఇతర వివరాలు బయటకు రాలేదు.
డిజిటల్ చాట్ స్టేషన్ కొన్ని రోజుల క్రితం Realme GT Neo 5 SE డివైజ్ స్పెసిఫికేషన్స్ షేర్ చేసింది. టిప్‌స్టర్ ప్రకారం, రియల్మీ Realme GT Neo 5 SE ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్సెట్ వాడనున్నట్లు సమాచారం. ఈ హ్యాండ్సెట్ 50ఎంపి సోని ఐఎంఎక్స్ 890 సెన్సర్, ఆర్బీజీ నోటిఫికేషన్ లైట్ తో వస్తోంది. రీసెంట్ లీక్ ప్రకారం, ఈ ఫోన్ 64ఎంపి మెయిన్ కెమెరాతో వస్తున్నట్లు తెలిసింది. ఇకపోతే పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Realme GT 3 స్పెసిఫికేషన్స్
Realme GT 3 డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ పై తయారైన చిప్సెట్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వాడారు. ఈ ఫోన్ 8జిబి+128జిబి, 12జిబి+256జిబి, 16జిబి+256జిబి, 16జిబి+512జిబి మరియు 16జిబి+1టిబి వేరియంట్స్ లో లభిస్తుంది.
Realme GT 3 స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఫ్లాట్ బెజెల్స్, 93.69 పర్సెంట్ కాంట్రాస్ట్ రేషియో, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1.07 బిలియన్ కలర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Realme GT 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మైక్రోస్కోప్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
Realme GT 3 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 240 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Realme GT 3 స్మార్ట్ ఫోన్ 163.85 మిల్లీ మీటర్ల పొడవు, 75.75 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











