125km రేంజ్ తో లాంచైన భారతదేశపు మొట్టమొదటి గెయిర్డ్ ఎలక్ట్రిక్ బైక్

Highlights

  • భారత్ లో లాంచైన Matter AERA ఎలక్ట్రిక్ బైక్
  • Matter AERA 5000 ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.1,43,999
  • Matter AERA 5000+ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.1,54,000

EV స్టార్టప్ Matter భారత్ లో మొట్టమొదటి గెయిర్డ్ ఎలక్ట్రిక్ బైక్ ని లాంచ్ చేసింది. Auto Expo 2023 లో మొదటిసారిగా ఈ బండిని కంపెనీ పరిచయం చేసింది. ఇప్పుడు Matter AERA బండిని భారత మార్కెట్ లోకి లాంచ్ చేసింది. మొత్తం నాలుగు వేరియంట్లలో Matter AERA ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయ్యింది. అవి: Matter AERA 4000, Matter AERA 5000, Matter AERA 5000+ మరియు Matter AERA 6000+.

Matter AERA ధర

కంపెనీ ప్రకారం, Matter AERA భారతదేశపు మొట్టమొదటి గెయిర్డ్ ఎలక్ట్రిక్ బైక్ అని తెలుస్తోంది. ధర గురించి మాట్లాడితే, Matter AERA 5000 ధరను రూ.1,43,999 గా నిర్ణయించారు. ఇక Matter AERA 5000+ బండి ధర రూ.1,54,000 గా ఉంది. ఈ ధరలు కంపెనీ వెబ్ సైట్ లో పేర్కొనబడ్డాయి. Matter AERA బండిపై 3 ఏళ్ళు లేదా అపరిమిత కిలోమీటర్ల వ్యారంటీని కంపెనీ కస్టమర్ కి హామీ ఇస్తోంది. అలాగే 3 ఏళ్ళు రోడ్ సైడ్ అసిస్టెన్స్ మరియు ఏఎంసీ/లేబర్ కవరేజీ ని అందిస్తోంది.

Matter AERA 5000 మరియు Matter AERA 5000+ ఫీచర్లు

Matter AERA 5000 బైక్ లో 5kWh, 6kWh లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ ప్యాక్స్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, 6kWh బ్యాటరీ ప్యాక్ Matter AERA 6000+ మోడల్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం, కంపెనీ ఈ రెండు బ్యాటరీ ప్యాక్స్ అందించే రేంజ్ వివరాలను వెల్లడించలేదు. 5 గంటల్లో ఈ బ్యాటరీ ప్యాక్ పూర్తిగా చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఫాస్ట్ చార్జర్ వాడితే 2 గంటల్లోనే బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవుతుంది.

Matter AERA 5000 మరియు Matter AERA 5000+ బండ్లలో 10kW ఎలక్ట్రిక్ మోటర్ ని అందించారు. ఇది హైపర్‌షిప్ట్ 4-స్పీడ్ మాన్యువల్ గెయిర్ బాక్స్ ద్వారా పవర్ జనరేట్ చేస్తుంది. 6 సెకన్ల కన్నా తక్కువ సమయంలోనే ఈ ఎలక్ట్రిక్ బైక్ 0 నుంచి 60 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది.

Matter AERA బండిలో 7-ఇంచ్ ఎల్సీడీ టచ్ స్క్రీన్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు, ఒక స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ కూడా ఉంది. దీని ద్వారా బైక్ కి సంబంధించిన సమాచారాన్ని యూజర్ తన ఫోన్ లో చూసుకోవచ్చు. ఈ బండిలో 4 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. 9-యాక్సిస్ ఇనెర్షియల్ మెషర్మెంట్ యూనిట్ ని ఈ బండిలో అందించారు.

భారతదేశపు మొట్టమొదటి గెయిర్డ్ ఎలక్ట్రిక్ బైక్ Matter AERA కి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు కదా? ఆసక్తి గల వారు ఈ బండిని ప్రయత్నించండి. త్వరలోనే కంపెనీ నుంచి సేల్ తేదీ, బుకింగ్స్ కి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleమార్చి 7 న లాంచ్ కానున్న Realme C55
Next articleమార్చి 15 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy A54 5G, Galaxy A34 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.