BIS, TDRA సర్టిఫికేషన్స్ పొందిన Redmi 12C

Highlights

  • త్వరలో Redmi 12C భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం
  • బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్ సైట్ పై కనిపించిన Redmi 12C ఇండియన్ వేరియంట్
  • బీఐఎస్ లిస్టింగ్ తో Redmi 12C ఇండియా లాంచ్ పై వచ్చిన స్పష్టత

భారతీయ మార్కెట్ లో త్వరలోనే Redmi 12C స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయాలని Redmi కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే గ్లోబల్ వేరియంట్ యొక్క స్పెసిఫికేషన్స్, డిజైన్ లీక్ అయ్యాయి. తాజాగా ఇండియన్ వేరియంట్ Redmi 12C బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. సర్టిఫికేషన్ ద్వారా Redmi 12C త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది. UAE కి చెందిన TDRA సర్టిఫికేషన్ ని కూడా Redmi 12C పొందింది.

Redmi 12C డివైజ్ ఎంట్రీ లెవెల్ కొనుగోలుదారులను ఉద్దేశించి తీసుకొస్తున్నారు. తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ ని కొనాలని భావించే వారికి ఇది సరైన ఎంపిక అవుతుంది. లీకైన స్పెసిఫికేషన్స్ ని బట్టి, ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 6.71-ఇంచ్ డిస్ప్లే, హెచ్డీ+ ప్యానెల్ తో రానున్నట్లు తెలిసింది.

Redmi 12C ఇండియా లాంచ్

ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ Redmi 12C ని Redmi 221220RN86I అనే మోడల్ నంబర్ తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్ సైట్ పై గుర్తించాడు. దీంతో ఇండియా లాంచ్ పై స్పష్టత వచ్చింది. కానీ, బీఐఎస్ లిస్టింగ్ ద్వారా ఫోన్ పేరు ఏంటో బయటకు రాలేదు. అయితే Redmi 12C గ్లోబల్ వేరియంట్ TDRA సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. ఈ లిస్టింగ్ లో పేరు పేర్కొనబడింది.

Redmi 12C స్పెసిఫికేషన్స్ (అంచనా)

ఇప్పటికే లీకైన Redmi 12C స్పెసిఫికేషన్స్ జాబితా ప్రకారం, ఈ డివైజ్ 6.71-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే తో రానున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ అయిన మీడియాటెక్ హీలియో జీ85 ని కలిగి ఉండనుంది. 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందిస్తున్నారు. పవర్ బ్యాకప్ కోసం Redmi 12C డివైజ్ లో 5,000 mAh బ్యాటరీ ఇచ్చారు.

Redmi 12C యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, మరొక క్యూవీజీఏ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. Redmi 12C స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ పై పని చేస్తుంది. త్వరలోనే Redmi 12C ఫోన్ లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన కంపెనీ నుంచి వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.