
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola త్వరలోనే భారతీయ మార్కెట్ లో Moto G Stylus (2023) డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ తాజాగా బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ Geekbench పై కనిపించింది. దీంతో ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. రెండర్స్ బయటకు వచ్చిన చాలా రోజులకు గీక్ బెంచ్ పై Moto G Stylus (2023) కనిపించింది. సరే, ఓసారి Moto G Stylus (2023) కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Geekbench లిస్టింగ్ ప్రకారం, Moto G Stylus (2023) స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోంది. ఇంకా ఈ డివైజ్ 4జిబి ర్యామ్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా స్పష్టమైంది. త్వరలో లాంచ్ కాబోవు Moto G Stylus (2023) డివైజ్ 6జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో రానున్నట్లు గత రూమర్లు తెలిపాయి. ఇది సెకండ్ బేస్ వేరియంట్ అయ్యే అవకాశం ఉంది. Moto G Stylus (2022) కి సక్సెసర్ గా Moto G Stylus (2023) మార్కెట్ లోకి వస్తోంది.
Moto G Stylus (2023) స్పెసిఫికేషన్స్
Moto G Stylus (2023) స్మార్ట్ ఫోన్ గీక్ బెంచ్ లిస్టింగ్ పై కనిపించడంతో స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఈ ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తోంది. ఈ చిప్సెట్ 1.80 గిగాహెర్ట్జ్ స్పీడుతో తిరిగే 6 కోర్స్, 2.00 గిగాహెర్ట్జ్ తో తిరిగే 2 కోర్స్ ని కలిగి ఉంది. చిప్సెట్ పేరు ఇంకా తెలియదు. రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.
గత నెలలో, Moto G Stylus (2023) యొక్క ముఖ్యమైన డిజైన్ ఎలిమెంట్స్ ని మోటోరోలా రివీల్ చేసింది. దీంతో కొన్ని విషయాలు తెలిసాయి. Moto G Stylus (2023) పంచ్-హోల్ కటౌట్, బిల్ట్-ఇన్ స్టైలస్ స్లాట్, 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు సమాచారం.
Moto G Stylus (2023) స్మార్ట్ ఫోన్ 50ఎంపి ప్రైమరీ కెమెరా, 4జి/5జి వేరియంట్స్, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు Moto G Stylus (2023) కి తెలిసింది ఇంతే. అయితే గీక్ బెంచ్ పై Moto G Stylus (2023) కనిపించింది కాబట్టి, లాంచ్ సమయం కూడా అతి సమీపంలోనే ఉందని చెప్పవచ్చు. త్వరలోనే మోటోరోలా సంస్థ నుంచి మోటో జీ స్టైలస్ 2023 కి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: Fire OS 7 తో మార్చి 14 న లాంచ్ కానున్న కొత్త Redmi Smart TV
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











