
నోకియా సంస్థ తక్కువ బడ్జెట్ లో Nokia C12 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కొన్ని రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైంది. ఒకసారి ఈ ఫోన్ ప్రత్యేకతలు చూస్తే, 6.3-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 5 ఎంపి సెల్ఫీ కెమెరా, 3డీ ప్యాటర్న్ డిజైన్ ఇందులో ఉన్నాయి. చాలా తక్కువ ధరకి రూ.5,999 తో మార్కెట్ లోకి ఈ ఫోన్ వచ్చింది. సరే, ఓసారి Nokia C12 యొక్క ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.
Nokia C12 ధర, సేల్ వివరాలు
Nokia C12 ఫోన్ 2జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో మార్కెట్ లోకి వచ్చింది. ఈ డివైజ్ ధరను రూ.5,999 గా నిర్ణయించారు. అమెజాన్ ఇండియా ద్వారా మార్చి 17 నుంచి ఈ ఫోన్ అమ్మకాలు మొదలవుతాయి. డార్క్ సైయన్, చార్కోల్ మరియు లైట్ మింట్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
Nokia C12 స్పెసిఫికేషన్స్
- 6.3-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
- 2జిబి ర్యామ్ (2జిబి వర్చువల్ ర్యామ్) + 64జిబి స్టోరేజీ
- యూనిఎస్ఓసీ 9863ఏ1 ప్రాసెసర్
- 8ఎంపి మెయిన్ కెమెరా + 5ఎంపి సెల్ఫీ కెమెరా
- 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ
Nokia C12 ఫోన్ లో 20:9 యాస్పెక్ట్ రేషియో, 1600 x 720 పిక్సెల్ రెజుల్యూషన్, 6.3-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి. 1.6 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన యూనిఎస్ఓసీ 9863ఏ1 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు. 2జిబి ర్యామ్, 2జి వర్చువల్ ర్యామ్, 64జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 256జిబి వరకు పెంచుకోవచ్చు.
ఇప్పుడు కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. Nokia C12 డివైజ్ లో 8ఎంపి మెయిన్ కెమెరా ఇచ్చారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. ఇది రిమూవబుల్ బ్యాటరీ.
Nokia C12 ఆండ్రాయిడ్ గో ఎడిషన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో గూగుల్ గో యాప్స్ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇవి చాలా తక్కువ స్టోరేజీని తీసుకుంటాయి. Nokia C12 లో ఐపీ52 రేటింగ్ ఉంది. దీని వల్లన నీరు మరియు ధూళి నుంచి కొంతమేరకు రక్షణ లభిస్తుంది. ఈ డివైజ్ లో బ్లూటూత్, వై-ఫై, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. ఈ ఫోన్ 177.4 గ్రాముల బరువు ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











