భారత్‌లో లాంచైన OPPO Find N2 Flip; స్పెసిఫికేషన్స్, ధర

Highlights

  • భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన OPPO Find N2 Flip
  • భారత్ లో OPPO Find N2 Flip ధర రూ.89,999
  • ఫ్లిప్ కార్ట్ మరియు ఒప్పో స్టోర్ ద్వారా ఆన్‌లైన్ లో మొదలుకానున్న OPPO Find N2 Flip విక్రయాలు

OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచైన సంగతి తెలిసిందే. నేడు ఒప్పో సంస్థ ఈ ఫోన్ యొక్క ధరను రివీల్ చేసింది. ఒప్పో బ్రాండ్ నుంచి ఇండియాకి వచ్చిన తొలి ఫోల్డబుల్ ఫోన్ OPPO Find N2 Flip. ఈ ఫోన్ చూడటానికి శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 మాదిరి కనిపిస్తోంది. సరే ఓసారి OPPO Find N2 Flip యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో OPPO Find N2 Flip ధర

OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ రూ.89,999 ధరతో భారత్ లో లాంచైంది. ఇది 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర. ఒప్పో స్టోర్స్ మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. పర్పుల్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. మార్చి 17 నుంచి OPPO Find N2 Flip సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ కొనుగోలు పై ఒప్పో సంస్థ 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. యస్ బ్యాంక్, ఐసీఐసీఐ మరియు కొటక్ బ్యాంక్ కార్డ్స్ పై రూ.5000 (10%) వరకు డిస్కౌంట్ మరియు 12 నెలల కాల వ్యవధితో నో-కాస్ట్ ఈఎంఐ కూడా ఆఫర్ చేస్తోంది.

OPPO Find N2 Flip స్పెసిఫికేషన్స్

OPPO Find N2 Flip లో 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 21:9 యాస్పెక్ట్ రేషియో, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, యూటీజీ గ్లాస్ ప్రొటెక్షన్, 100 శాతం ఎస్ఆర్జీబీ కలర్ గేముత్ ఉన్నాయి. అలాగే 3.26-ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ప్లే ఉంది. ఇది 900 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది.

OPPO Find N2 Flip లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం OPPO Find N2 Flip లో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఓటీజీ రివర్స్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OPPO Find N2 Flip ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ710 ఎంసీ10 జీపీయూ వినియోగించారు. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.