భారత్ లో ఏప్రిల్ 11 న లాంచ్ అవుతోన్న Vivo T2, Vivo T2x

Highlights

  • అఫీషియల్ గా రివీలైన Vivo T2, Vivo T2x ఇండియా లాంచ్ డేట్
  • 5జీ నెట్వర్క్ తో వస్తోన్న రెండు ఫోన్లు
  • టీజర్ ఇమేజ్ ద్వారా రివీలైన బ్లూ, గోల్డ్ కలర్ ఆప్షన్స్

నిన్నే ఫ్లిప్ కార్ట్ లో వివో టీ2 సిరీస్ మైక్రోసైట్ ప్రత్యక్షమైంది. ఇప్పుడు వివో ఇండియా అఫీషియల్ గా Vivo T2 సిరీస్ లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ లైనప్ లో Vivo T2, Vivo T2x ఫోన్లు రానున్నాయని కంపెనీ తెలిపింది. అఫీషియల్ పోస్టర్ ద్వారా ఫోన్లు బ్లూ మరియు గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో వస్తున్నట్లు అర్థమవుతోంది. Vivo T2 సిరీస్ Vivo T1 మోడల్స్ కి సక్సెసర్ గా వస్తోంది. ఈ రెండు కొత్త ఫోన్లు 5జీ నెట్వర్క్ కి సపోర్ట్ చేస్తాయి.

భారత్ లో Vivo T2, Vivo T2x లాంచ్ తేదీ

Vivo T2 సిరీస్ భారత్ లో ఏప్రిల్ 11 న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది. ఫ్లిప్ కార్ట్, వివో ఈ-వెబ్ సైట్ మరియు ఆఫ్ లైన్ రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

టీజర్ ఇమేజ్ ని బట్టి, Vivo T2 సిరీస్ డ్యూయల్ సర్క్యులర్ మాడ్యూల్స్ లో వస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై రెండు కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. Vivo T2, Vivo T2x డివైజెస్ బ్లూ మరియు గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఫోన్లు బాక్సీ డిజైన్, కాస్త రౌండెడ్ కార్నర్స్ తో కనిపిస్తున్నాయి.

Vivo T2, Vivo T2x స్పెసిఫికేషన్స్ (అంచనా)

లీకైన స్పెసిఫికేషన్స్ ప్రకారం, Vivo T2 డివైజ్ లో ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. ఈ డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 6జిబి/8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ తో రానుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోంది. ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీని కలిగి ఉంటుంది.

Vivo T2x స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ వాడినట్లు సమాచారం. ఈ ఫోన్ సెగ్మెంట్ లో చీపెస్ట్ 5జీ ఫోన్ గా నిలవనుంది. ఈ కొత్త వివో స్మార్ట్ ఫోన్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే తో వస్తోంది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో రానుందని సమాచారం.

మార్కెట్ లో అందుబాటులో ఉన్న Vivo T-సిరీస్ ఫోన్లు

Vivo T2 5G, Vivo T2x 5G ఫోన్లు ఏప్రిల్ 11 న రివీల్ అవుతాయి. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు వివో సంస్థ Vivo T1 Pro 5G, Vivo T1x, Vivo T1 5G, Vivo T1 4G ఫోన్లను తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.11,999 తో మొదలై రూ.23,999 వరకు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.