ఏప్రిల్ 12 న భారత్ లో లాంచ్ కానున్న Realme Narzo N55

Highlights

  • రివీలైన Realme Narzo N55 ఇండియా లాంచ్ తేదీ
  • లాంచ్ కి ముందు అఫీషియల్ డిజైన్ ని రివీల్ చేసిన బ్రాండ్
  • డ్యూయల్-టోన్ రియర్ ప్యానెల్, డ్యూయల్ కెమెరా మాడ్యూల్ తో వస్తోన్న Realme Narzo N55

రియల్మీ అతిత్వరలో తన కొత్త నార్జో-బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. ఈ డివైజ్ Realme Narzo N55 అనే పేరుతో భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తోంది. బ్రాండ్ ఇంకా అఫీషియల్ గా పేరుని ప్రకటించాల్సి ఉంది. ఈలోపు లాంచ్ తేదీ, ప్రధాన స్పెసిఫికేషన్స్ వివరాలు బయటకు వచ్చాయి. త్వరలో రిలీజ్ అయ్యే ఈ ఫోన్ లుక్స్ ని బ్రాండ్ కొన్ని రోజుల నుంచి టీజ్ చేస్తోంది.

రివీలైన Realme Narzo N55 డిజైన్

Realme Narzo N55 వెనకవైపు నుంచి ఎలా ఉంటుందో తెలిసింది. బ్యాక్ సైడ్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ కనిపిస్తోంది. టాప్ లెఫ్ట్ లో కెమెరా మాడ్యూల్ ఉంటుంది. దీనికి తోడు ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. ఫోన్ కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నట్లు కనిపించడం లేదు. Realme Narzo N55 డివైజ్ అమోలెడ్ ప్యానెల్ లేదా ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ తో రావొచ్చు.

Realme Narzo N55 లాంచ్ తేదీ మరియు విక్రయం

Realme Narzo N55 భారత మార్కెట్ లో ఏప్రిల్ 12 న లాంచ్ అవుతోంది. ఇదే రోజున మధ్యాహ్నం 12 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుంది. Realme Narzo N55 స్మార్ట్ ఫోన్ అమెజాన్ స్పెషల్ అని రియల్మీ తెలిపింది. దీంతో ఈ ఫోన్ అమెజాన్ ద్వారా విక్రయానికి వస్తుందని స్పష్టమైంది. రియల్మీ అఫీషియల్ వెబ్ సైట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మరియు అమెజాన్ లో లాంచ్ ఈవెంట్ టెలీకాస్ట్ అవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.