స్నాప్ డ్రాగన్ 695 చిప్‌తో భారత్ లో లాంచ్ కానున్న Vivo Y100A, లీకైన రిటైల్ బాక్స్, స్పెసిఫికేషన్స్

Highlights

  • 5జీ ప్రాసెసర్ తో లాంచ్ కానున్న Vivo Y100A
  • మూడు కలర్ ఆప్షన్స్ తో రానున్న Vivo Y100A
  • 64ఎంపి రియర్ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తోన్న Vivo Y100A

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో Vivo Y100A డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఎన్నో రిపోర్ట్స్ ఇప్పటి వరకు లీక్ అయ్యాయి. ఇప్పుడు 91Mobiles Hindi Vivo Y100A డివైజ్ స్పెసిఫికేషన్స్, ధరకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టింది. రిటైల్ బాక్స్ ఇమేజెస్ కూడా బయటకు వచ్చాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo Y100A రిటైల్ బాక్స్

  • డ్యూయల్ టోన్ బ్యాక్ ప్యానెల్
  • కలర్ చేంజింగ్ రియర్ ప్యానెల్

ఈ వివో స్మార్ట్ ఫోన్ రిటైల్ బాక్స్ గురించి మాట్లాడితే, అది తెలుపు రంగులో ఉంది. రిటైల్ బాక్స్ ద్వారా ఫోన్ కలర్ ఆప్షన్, బ్యాక్ ప్యానెల్ డిజైన్ సమాచారం తెలిసింది. రిపోర్ట్ ప్రకారం, ఈ డివైజ్ కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ తో రానుందని తెలుస్తోంది. బ్యాక్ ప్యానెల్ డ్యూయల్ టోన్ తో వస్తోంది. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: ట్విలైట్ గోల్డ్, పసిఫిక్ బ్లూ మరియు మెటల్ బ్లాక్.

ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ వస్తోంది. కెమెరా సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ రెండు రింగ్స్ లో కనిపిస్తున్నాయి. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. కలర్ చేంజింగ్ ప్యానెల్, 64ఎంపి ఓఐఎస్ కెమెరా, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫోన్ రిటైల్ బాక్స్ ప్యానెల్ పై రాసి ఉన్నాయి.

Vivo Y100A 5G స్పెసిఫికేషన్స్

  • స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్
  • 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
  • 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ: ఎక్స్‌క్లూజివ్ సమాచారం ప్రకారం, ఈ వివో ఫోన్ క్వాల్కమ్ 5జీ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 695 తో రానున్నట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని రిపోర్ట్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ తో ఈ ఫోన్ రానుందని తెలిపాయి. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లభించనుంది.

డిస్ప్లే: Vivo Y100A 5G స్మార్ట్ ఫోన్ 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్ తో రానుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

బ్యాటరీ మరియు చార్జింగ్: ఈ వివో స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో వస్తోంది.

కెమెరా: Vivo Y100A డివైజ్ లో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Vivo Y100A 5G ధర

  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • రూ.26,999

ఈ వివో ఫోన్ మార్కెట్ లో 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ లో మార్కెట్ లోకి లాంచ్ కానుంది. రిటైల్ బాక్స్ పై ఈ ఫోన్ ధర రూ.31,999 గా ఉంది. కానీ ఈ ఫోన్ సేల్ ప్రైస్ రూ.26,999 గా ఉండనుంది.

Vivo Y100A ఎప్పుడు లాంచ్ కానుంది?

Vivo Y100A డివైజ్ లాంచ్ వివరాలను వివో సంస్థ ఇంకా ప్రకటించలేదు. మీడియా రిపోర్ట్స్ నిజమైతే గనుక, కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ని ఏప్రిల్ నెలలోనే లాంచ్ చేయనుంది. లీకైన రిటైల్ బాక్స్ ఇమేజ్ ని బట్టి అతి త్వరలో ఈ ఫోన్ ని అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.