లీకైన OPPO A98 5G రెండర్, ప్రధాన స్పెసిఫికేషన్స్

Highlights

  • ఎన్బీటీసీ, సీక్యూసీ, టీడీఆర్ఏ, ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్స్ పై కనిపించిన Oppo A98 5G
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో రానున్న డివైజ్
  • 64ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ డిస్ప్లే ఈ ఫోన్ లో ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో త్వరలో ఏ-సిరీస్ లో OPPO A98 5G డివైజ్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ ఇప్పటికే ఎన్బీటీసీ, సీక్యూసీ, టీడీఆర్ఏ మరియు ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించింది. తాజాగా, ఈ ఫోన్ రెండర్స్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Appuals, టిప్‌స్టర్ సుదాన్శు అంబోరే మరియు SnoopyTech ద్వారా OPPO A98 5G వివరాలు బయటకు వచ్చాయి.

OPPO A98 5G రెండర్స్ ద్వారా ఫుల్-స్క్రీన్ డిస్ప్లే, సెంటర్డ్ పంచ్ హోల్ నాచ్ రివీల్ అయ్యాయి. లీక్స్ ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో రానున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ డివైజ్ 64ఎంపి మెయిన్ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 67 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం.

OPPO A98 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే:

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ లో 120 హెర్ట్జ్ ఎల్టీపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 391 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 6.7-ఇంచ్ స్క్రీన్, పాండా గ్లాస్ ప్రొటెక్షన్, పంచ్-హోల్ నాచ్ వంటివి ఉన్నాయి.

చిప్సెట్, ఓఎస్

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో వస్తోంది. ఈ చిప్సెట్ కి అడ్రెనో 619 జీపీయూ గ్రాపిక్స్ పెయిర్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్, 256జిబి స్టోరేజీ తో రానుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

కెమెరా

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఓఐఎస్ ఫీచర్ తో రావడం లేదు. లీక్ ప్రకారం, ఈ డివైజ్ లో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్) ఉంటుందని సమాచారం. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.

బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే చాన్స్ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇవ్వనున్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleGCF సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్టైన Vivo V29 Lite 5G
Next articleమొబైల్ ఫోన్ పేలి కేరళలో 8 ఏళ్ళ బాలిక మృతి
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.