6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో లాంచైన Moto G 5G (2023), Moto G Stylus (2023)

Highlights

  • గ్లోబల్ గా లాంచైన Moto G 5G, Moto G Stylus 2023 ఎడిషన్స్
  • హీలియో జీ85 చిప్సెట్ తో వచ్చిన Moto G Stylus 2023
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్, మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ తో వచ్చిన ఫోన్లు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా తాజాగా రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. Moto G 5G 2023, Moto G Stylus 2023 ఫోన్లు గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లు గతేడాది ఏప్రిల్ లో అనౌన్స్ అయ్యాయి. ఇక ఈ ఫోన్ల స్పెసిఫికేషన్స్ చూస్తే, మోటో జీ 5జీ 2023 డివైజ్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్, 4జిబి ర్యామ్ ఉన్నాయి.

మోటో జీ స్టైలస్ 5జీ 2023 స్మార్ట్ ఫోన్ లో 6.8-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ స్టైలస్ సపోర్ట్, స్టీరియో స్పీకర్, డాల్బి అట్మాస్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చింది.

Moto G 5G (2023), Moto G Stylus (2023) ధరలు

మోటో జీ 5జీ, మోటో జీ స్టైలస్ 2023 ఎడిషన్ ఫోన్ల ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. మోటో జీ 5జీ 2023 ధర 250 డాలర్లు (సుమారు రూ.20,500) గా ఉంది. మే 25 నుంచి మోటోరోలా.కామ్, బెస్ట్ బై, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం భారత్ లో ఈ ఫోన్లు అందుబాటులో లేవు.

మోటో జీ స్టైలప్ (2023) ధర 200 డాలర్లు (సుమారు రూ.16,400) గా ఉంది. ఈ హ్యాండ్సెట్ మే 5 వ తేదీ నుంచి బెస్ట్ బై, మోటోరోలా.కామ్, అమెజాన్.కామ్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

Moto G 5G (2023) స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

డిస్ప్లే, ర్యామ్

Moto G 5G (2023) స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 480+ ప్రాసెసర్, 4జిబి ర్యామ్, హ్యాండ్సెట్ 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరా విభాగం

Moto G 5G (2023) లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. 8ఎంపి ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్ లో అందించారు.

బ్యాటరీ, కనెక్టివిటీ

పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. డాల్బి అట్మాస్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ, 5జీ కనెక్టివిటీ ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

Moto G Stylus (2023) స్పెసిఫికేషన్స్

డిస్ప్లే, ర్యామ్

Moto G Stylus (2023) ఒక 4జీ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉన్నాయి.

ఓఎస్

Moto G Stylus (2023) డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా విభాగం

Moto G Stylus (2023) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. Moto G Stylus (2023) లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్

Moto G Stylus (2023) లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ

Moto G Stylus (2023) లో 4జీ, 3.5ఎంఎం ఆడియో జాక్, వై-ఫై, బ్లూటూత్ 5.0, సింగిల్ సిమ్ సపోర్ట్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.