లీకైన Motorola Razr 40 Ultra స్పెసిఫికేషన్స్; స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో వస్తోన్న డివైజ్

Highlights

  • నెట్టింట్లో ప్రత్యక్షమైన Motorola Razr 40 Ultra స్పెసిఫికేషన్స్
  • అమోలెడ్ డిస్ప్లే, 3.5-ఇంచ్ కవర్ డిస్ప్లే తో వస్తోన్న డివైజ్
  • ఇంకా రివీల్ కావాల్సిన Motorola Razr 40 Ultra లాంచ్ తేదీ

ఇటీవలి కాలంలో Motorola Razr 40 Ultra కి సంబంధించిన లీక్స్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్ యొక్క ఇమేజెస్ తో పాటు ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. అయితే కంపెనీ ఇంకా ఈ ఫ్లాగ్షిప్ డివైజ్ ని అనౌన్స్ చేయాల్సి ఉంది. కానీ, ఈ ఫోన్ ఈ నెలలోనే ఏ సమయంలోనైనా లాంచ్ కావొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తాజాగా Motorola Razr 40 Ultra డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. గత నివేదికలను బట్టి, ఈ ఫోల్డబుల్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. సరే, ఓసారి Motorola Razr 40 Ultra ఫ్లాగ్షిప్ పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Motorola Razr 40 Ultra స్పెసిఫికేషన్స్

XDA-Developers రిపోర్ట్ ప్రకారం, Motorola Razr 40 Ultra డివైజ్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.

డిస్ప్లే

Motorola Razr 40 Ultra లో ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2640 పిక్సెల్స్ రెజుల్యూషన్, 3.5-ఇంచ్ కవర్ డిస్ప్లే, 1056*1066 పిక్సెల్స్ రెజుల్యూషన్ వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని అంచనా. గత రిపోర్ట్స్ ప్రకారం, మెయిన్ స్క్రీన్ 6.7-ఇంచ్ ఉంటుందని తెలుస్తోంది.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ

Motorola Razr 40 Ultra లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉంటుందని సమాచారం. అలాగే ఈ డివైజ్ 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో రానుందని అంచనా వేస్తున్నారు. ఇతర ర్యామ్ మరియు స్టోరేజీ ఆప్షన్స్ లో కూడా ఈ ఫోన్ వచ్చే చాన్స్ ఉంది.

ఓఎస్

Motorola Razr 40 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ, చార్జింగ్

Motorola Razr 40 Ultra డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 3640 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

కెమెరా విభాగం

Motorola Razr 40 Ultra లో 12ఎంపి సోని ఐఎంఎక్స్563 ప్రైమరీ కెమెరా, 13ఎంపి ఎస్‌కే హైనిక్స్ హై1336 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయని సమాచారం. ఈ డివైజ్ లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటాయని గత రిపోర్ట్స్ తెలిపాయి.

కనెక్టివిటీ, కలర్ ఆప్షన్స్

Motorola Razr 40 Ultra యొక్క కనెక్టివిటీ ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ డివైజ్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ సిమ్, ఎన్‌ఎఫ్‌సీ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి. Motorola Razr 40 Ultra డివైజ్ బ్లాక్, బ్లూ మరియు బర్బెరీ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. లాంచ్ తేదీ తదితర వివరాలను మోటోరోలా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.