
Nothing Phone (2) కోసం నతింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్ వేసవిలో లాంచ్ కానుందని తాజాగా కంపెనీ వెల్లడించింది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ, కొన్ని రోజులుగా నతింగ్ సంస్థ తన రాబోవు ఫోన్ కి సంబంధించి టీజ్ చేస్తూ వస్తోంది. చిప్సెట్ సహా ఇతర ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని నతింగ్ కంపెనీ టీజ్ చేసింది. సరే, Nothing Phone (2) డివైజ్ విశేషాలు తెలుసుకుందాం పదండి.
త్వరలో లాంచ్ కానున్న Nothing Phone (2)
Premium.
Phone (2) is coming summer 2023.
Sign-up for updates: https://t.co/FEJL4Jb2Aw pic.twitter.com/Nj8YONbYvm
— Nothing (@nothing) May 3, 2023
ఈ వేసవిలో Nothing Phone (2) లాంచ్ అవుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సైన్-అప్ అవ్వమని కంపెనీ నతింగ్ ఫ్యాన్స్ ని కోరుతోంది. Nothing Phone (1) కంటే ప్రీమియమ్ ఫీచర్స్ తో Nothing Phone (2) మార్కెట్ లోకి వస్తోంది. నతింగ్ బ్రాండ్ ఈ ఫోన్ తో మిడ్-రేంజ్ సెగ్మెంట్ నుంచి ప్రీమియమ్ వైపు అడుగులు వేస్తోంది. ఇక Nothing Phone (2) డివైజ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోంది.
Nothing Phone (2) డివైజ్ గ్లైఫ్ ఇంటర్ఫేస్ తో వస్తున్నట్లు సమాచారం. అలాగే ట్రాన్స్‌పరెంట్ రియర్ ప్యానెల్ పైన మల్టీపుల్ ఎల్ఈడీ లైట్స్ ఉండనున్నాయి. ఈస్తటిక్ ట్వీక్స్ అక్కడక్కడ కనిపించనున్నాయి. అలాగే ఒక మ్యూట్ స్విచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
తొలుత Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ యూఎస్ లో లాంచ్ కానుందని సమాచారం. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది. ఈ ఫోన్ బ్యాటరీ సమాచారం బీఐఎస్ వెబ్ సైట్ లో కనిపించడంతో త్వరలోనే Nothing Phone (2) డివైజ్ భారత్ లో లాంచ్ కానుందని స్పష్టమైంది.
అయితే, ఇక్కడ మనకు Nothing Phone (2) గురించి అఫీషియల్ గా తెలిసింది ఇంతే. గతంలో వచ్చిన రిపోర్ట్స్ ద్వారా ఫోన్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అవెలా ఉన్నాయో చూద్దాం.
Nothing Phone (2) స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
- 120Hz అమోలెడ్ డిస్ప్లే
Nothing Phone (2) డివైజ్ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో రానున్నట్లు తెలుస్తోంది. ఇది అంచనా మాత్రమే. స్క్రీన్ సైజ్ గురించి ఇంకా సమాచారం లేదు.
చిప్సెట్
- స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1
Nothing Phone (2) డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. గత మోడల్ తో పోల్చితే ఇది చక్కటి అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు.
ర్యామ్, స్టోరేజీ
- 12జిబి ర్యామ్
- 256జిబి స్టోరేజీ
Nothing Phone (2) లో 12జిబి వరకు ర్యామ్ ఉంది. అలాగే స్టోరేజీ విషయానికి వస్తే, ఇందులో 256జిబి స్టోరేజీని అందించనున్నారు. ఇతర ర్యామ్ మరియు స్టోరేజీ వేరియంట్స్ ఉండే అవకాశం ఉంది.
బ్యాటరీ
- 5000mAh బ్యాటరీ
Nothing Phone (2) లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ గురించి ఇంకా తెలియదు. ఈసారి కాస్త హయ్యస్ట్ ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్ ని ఈ ఫోన్ లో అందించేందుకు అవకాశం ఉంది. గత మోడల్ లో 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్ ని అందించారు.











