అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023: రూ.25,000 లోపు బడ్జెట్‌లో లభించే బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు

Highlights

  • అమెజాన్ లో కొనసాగుతోన్న గ్రేట్ సమ్మర్ సేల్
  • ఎన్నో ఉత్పత్తులపై లభిస్తోన్న డిస్కౌంట్స్
  • స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్

ఈరోజుల్లో 5జీ స్మార్ట్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. భారత్ లో ఇప్పటికే జియో, ఎయిర్టెల్ సంస్థలు తమ 5జీ సేవలను ప్రారంభించాయి. చాలా నగరాల్లో ఇప్పటికే ఈ 5జీ సేవలు యూజర్లకు అందుతున్నాయి. ఇక మీరు గనుక 5జీ ఫోన్ కొనాలని భావిస్తుంటే, మీకు ప్రస్తుతం కొనసాగుతోన్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇక్కడ మీకోసం రూ.25,000 లోపు ధర కలిగి, అమెజాన్ లో అందుబాటులో ఉన్న ఫోన్ల జాబితాను అందిస్తున్నాం. ఓసారి చూసేయండి.

iQOO Z6 Lite 5G

iQOO Z6 Lite 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్, 120 హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ అసలు ధర రూ.15,999 కాగా, డీల్ ధర బ్యాంక్ డిస్కౌంట్ తో కలిపి రూ.11,999 గా ఉంది.

Redmi Note 12 5G

Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ 5జీ కనెక్టివిటీతో వచ్చింది. ఈ ఫోన్ అసలు ధర రూ.19,999 కాగా, సేల్ సందర్భంగా బ్యాంక్ డిస్కౌంట్ కలిపి రూ.15,999 కే లభిస్తోంది. ఈ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 48ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

OnePlus Nord CE 3 Lite 5G

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.19,999 కాగా, సేల్ సందర్భంగా బ్యాంక్ డిస్కౌంట్ తో కలిపి రూ.18,999 కి లభిస్తోంది. OnePlus Nord CE 3 Lite 5G పేస్టల్ లైమ్ కలర్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 108ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ ఉన్నాయి.

Oppo A78 5G

Oppo A78 5G డివైజ్ ని అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.21,999 కాగా, బ్యాంక్ డిస్కౌంట్ పై సేల్ సందర్భంగా రూ.17,999 కే లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6.56-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

Redmi 11 Prime 5G

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో భాగంగా Redmi 11 Prime 5G డివైజ్ పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.15,999 కాగా, సేల్ సందర్భంగా బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకుని రూ.12,999 కే లభిస్తోంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

Samsung Galaxy M14 5G

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ని అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.17,990 కాగా, బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకుని రూ.12,490 కే లభిస్తోంది. ఈ ఫోన్ లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 13ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Realme Narzo 50 5G

Realme Narzo 50 5G స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.17,999 కాగా, బ్యాంక్ డిస్కౌంట్ తో సేల్ సందర్భంగా రూ.12,999 కే లభిస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్, ఫుల్ హెచ్డీ 90 హెర్ట్జ్ డిస్ప్లే, 48ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

Samsung Galaxy M33 5G

Samsung Galaxy M33 5G స్మార్ట్ ఫోన్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి మెయిన్ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, ర్యామ్ ప్లస్ ఫీచర్ ఉన్నాయి. ఈ ఫోన్ అసలు ధర రూ.25,999 కాగా, బ్యాంక్ డిస్కౌంట్ తో కలిపి సేల్ సందర్భంగా రూ.15,749 కే లభిస్తుంది.

Redmi K50i 5G

Redmi K50i 5G స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.31,999 కాగా, సేల్ సందర్భంగా బ్యాంక్ డిస్కౌంట్ తో కలిపి రూ.19,999 కే లభిస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బి విజన్ సర్టిఫికేషన్, 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5080 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

Lava Blaze 5G

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.14,999 కాగా, సేల్ లో భాగంగా బ్యాంక్ డిస్కౌంట్ తో కలిపి రూ.9,499 కే లభిస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, 6జిబి వరకు ర్యామ్, వర్చువల్ ర్యామ్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఉన్నాయి.