
OPPO F23 5G స్మార్ట్ ఫోన్ మే 15 న భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ని కంపెనీ చాలా రోజుల నుంచి టీజ్ చేస్తూ వస్తోంది. అలాగే ఒప్పో ఇండియా వెబ్ సైట్ లో కూడా ఈ డివైజ్ కనిపిస్తోంది. అయితే OPPO F23 5G లాంచ్ కి ముందే ధర లీక్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ 64ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. సరే, OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లీకైన ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
భారత్‌లో ఏ ధరకు OPPO F23 5G లాంచ్ అవ్వనుంది?
లీక్ ద్వారా రివీల్ అయిన వివరాల ప్రకారం, OPPO F23 5G స్మార్ట్ ఫోన్ ధర రూ.23,999 గా ఉంది. మే 15 న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. ఇకపోతే లీక్ ప్రకారం, OPPO F23 5G డివైజ్ సేల్ మే 18 నుంచి మొదలవుతుందని తెలుస్తోంది. ఆన్లైన్ షాపింగ్ సైట్స్ తో పాటు, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ లో కూడా OPPO F23 5G ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
OPPO F23 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
- 6.72-ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో పంచ్-హోల్ కటౌట్ ఉంది. ఈ కటౌట్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
ర్యామ్, చిప్సెట్, స్టోరేజీ
- 8జిబి వర్చువల్ ర్యామ్
- స్నాప్ డ్రాగన్ 695
OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 256జిబి స్టోరేజీ 8జిబి ఆన్‌బోర్డ్ ర్యామ్ ఉన్నాయి. అంటే వర్చువల్ ర్యామ్ తో కలుపుకుని యూజర్ కి 16జిబి ర్యామ్ లభిస్తుంది.
కెమెరా విభాగం
- 64ఎంపి మెయిన్ కెమెరా
- 32ఎంపి ఫ్రంట్ కెమెరా
OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మోనోక్రోమ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ, చార్జింగ్
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 67 వాట్ సూపర్‌వూక్
OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.











