
OnePlus సంస్థ ఈ ఏడాది ఆరంభంలో తన ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 11 ని లాంచ్ చేసింది. ఇక తదుపరి ఫ్లాగ్షిప్ కి చాలా సమయం ఉన్న తరుణంలో, తాజాగా OnePlus 12 కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. ఆ రిపోర్ట్ ప్రకారం, OnePlus 12 డివైజ్ భారీ కెమెరా మార్పుతో రానుందని సమాచారం. ఇప్పటికే ఆ దిశగా టెస్ట్ లు మొదలయ్యాయని తెలుస్తోంది. అయితే ఇది రూమర్ అనే విషయం గమనించాలి. రానున్న రోజుల్లో దీని పై మరింత క్లారిటీ రానుంది.
రూమర్ల ప్రకారం, OnePlus 12 డివైజ్ కెమెరా డిపార్ట్మెంట్ లో భారీ అప్‌గ్రేడ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వన్‌ప్లస్ సంస్థ పెరిస్కోప్ లెన్స్ పై పరీక్షలు జరుపుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. సరే, ఓసారి OnePlus 12 అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
OnePlus 12 స్పెసిఫికేషన్స్ (అంచనా)
OnePlus 12 గురించి మనం వినడం ఇదే తొలిసారి. కాబట్టి అప్పుడే ఏ అభిప్రాయానికి రాకూడదు. ఇక వీబో లీకర్ డిజిటల్ చాట్ స్టేషన్ (ఆండ్రాయిడ్ అథారిటీ ద్వారా) లీక్ ప్రకారం, OnePlus 12 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో రానున్నట్లు తెలుస్తోంది.
- టిప్‌స్టర్ ప్రకారం, OnePlus సంస్థ SM8650 అనే మోడల్ నంబర్ కలిగిన ప్రోడక్ట్ కోసం ఒక పెరిస్కోప్ కెమెరా ను టెస్ట్ చేస్తోందట. ఈ మోడల్ నంబర్ క్వాల్కమ్ యొక్క తదుపరి ఫ్లాగ్షిప్ మొబైల్ చిప్సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ది అని సమాచారం.
- అయితే లీక్‌స్టర్ OnePlus 12 గురించి పేర్కొనలేదు. కానీ అదే డివైజ్ అని చెప్పేందుకు అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి.
- స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఈ ఏడాది చివరికల్లా రిలీజ్ కానుంది. మరి OnePlus 12 డివైజ్ వచ్చే ఏడాది ఆరంభంలో లాంచ్ అవుతుందో లేదో చూడాలి.
- వన్‌ప్లస్ సంస్థ పెరిస్కోప్ కెమెరాలను టెస్ట్ చేస్తోందని టిప్‌స్టర్ మ్యాక్స్ జాంబర్ కూడా చెప్పారు.
- పెరిస్కోప్ కెమెరాతో OnePlus 12 మెరుగైన జూమ్ సామర్థ్యాన్ని కలగి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా, గూగుల్ పిక్సెల్ 7 ప్రో డివైజెస్ లో ఈ తరహా కెమెరా ఉంది. ఈ పెరిస్కోప్ లెన్స్ 10ఎక్స్ ఆప్టికల్ జూమ్ మరియు 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ కి సపోర్ట్ చేస్తుంది.
OnePlus 12 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యేందుకు ఇంకా చాలా రోజుల సమయం ఉంది కానీ, ఇది కచ్చితంగా కెమెరా గేమ్ ని మార్చేసి, తన పోటీదారులకు గట్టి సవాల్ విసరడం ఖాయమని తెలుస్తోంది. కంపెనీ ఏదైనా మార్పు చేస్తే తప్పితే, OnePlus 12 స్మార్ట్ ఫోన్ 2024 ఆరంభంలోనే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో OnePlus 12 ఫోన్ లాంచ్ పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.











