
భారతీయ మార్కెట్ లో నోకియా సంస్థ తన ఫీచర్ ఫోన్ మార్కెట్ ని మరింత విస్తృతం చేసుకుంటూ వెళ్తోంది. తాజాగా ఈ సంస్థ రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. ఈ కీప్యాడ్ ఫోన్లు భారత్ లో Nokia 105 (2023) మరియు Nokia 106 4G పేరుతో లాంచ్ అయ్యాయి. కొత్త కీప్యాడ్ ఫోన్లు యూపీఐ 123పే అనే ఫీచర్ తో వచ్చాయి. ఈ ఫీచర్ వల్లన ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.
Nokia 105 (2023), Nokia 106 4G ధరలు
- Nokia 105 (2023) ఫీచర్ ఫోన్ రూ.1,299 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ని చార్కోల్, సియన్ మరియు రెడ్ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు.
- Nokia 106 4G కీప్యాడ్ ఫోన్ భారతీయ మార్కెట్ లో రూ.2,199 ధరకి లభించనుంది. ఈ ఫోన్ చార్కోల్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
UPI 123PAY ఫీచర్
UPI 123PAY అనేది ఒక ఇన్‌స్టంట్ పేమెంట్ సిస్టమ్. దీన్ని ఎన్‌పీసీఐ అభివృద్ధి చేసింది. ఈ ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఎంతో సురక్షితమైన, భద్రతతో కూడిన విధానం. UPI 123PAY నాలుగు ఆప్షన్స్ ని ఆఫర్ చేస్తుంది. అవి: ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) నంబర్, ఫీచర్ ఫోన్ యాప్, మిస్డ్-కాల్ బేస్డ్ ఇంటర్‌ఫేస్ మరియు ప్రాక్సిమిటీ సౌండ్-బేస్డ్ పేమెంట్.
Nokia 106 4G ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్
- ఐపీఎస్ డిస్ప్లే
- టీ9 కీప్యాడ్
- 1450ఎంఏహెచ్ బ్యాటరీ
Nokia 106 4G ఫీచర్ ఫోన్ లో ఐపీఎస్ డిస్ప్లే టెక్నాలజీని వాడారు. దీని స్క్రీన్ పెద్దగా ఉంటుంది. టీ9 కీప్యాడ్ ని ఈ ఫోన్ లో అందించారు. పవర్ బ్యాకప్ కోసం, ఈ ఫోన్ లో 1450 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలా సమయం పాటు బ్యాకప్ అందిస్తుంది.
ఎంటర్టెయిన్మెంట్ కోసం, Nokia 106 4G ఫోన్ లో ఇన్-బిల్ట్ ఎంపీ3 ప్లేయర్, ఎఫ్ఎం రేడియో ఇచ్చారు. ఎఫ్ఎం ని వైర్లెస్ గా ప్లే చేయవచ్చు. ఈ ఫోన్ లో మైక్రో యూఎస్బీ స్లాట్ మరియు మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఇచ్చారు. స్నేక్ గేమ్, టార్చ్ లైట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ నోకియా ఫోన్లలో 2,000 వరకు కాంటాక్ట్స్ మరియు 500 వరకు ఎస్ఎంఎస్ లను సేవ్ చేసుకోవచ్చు.
Nokia 105 (2023) ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్స్
- 1.8-ఇంచ్ క్యూవీజీఏ స్క్రీన్
- 1000ఎంఏహెచ్ బ్యాటరీ
- ఎస్30+ ఓఎస్
Nokia 105 (2023) ఫీచర్ ఫోన్ లో 1.8-ఇంచ్ క్యూవీజీఏ స్క్రీన్ ఉంటుంది. ఈ మొబైల్ ఎస్30+ ఓఎస్ పై పని చేస్తుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 1,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఈ నోకియా ఫోన్ ని ఒక్కసారి చార్జ్ చేస్తే, కొన్ని రోజులపాటు వాడుకోవచ్చు. ఈ ఫోన్ లో వైర్లెస్ ఎఫ్ఎమ్ రేడియో, టార్చ్ లైట్ వంటి ఫీచర్లు అందించారు.











