సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ప్లాట్ఫామ్ పై యూజర్లు తమ ఫోటోలను, చిన్న వీడియో రీల్స్ ని షేర్ చేస్తుంటారు. ఎప్పుడు కూడా యూజర్లు స్టైలిష్ మరియు ఆటిట్యూడ్ క్యాప్షన్స్ పోస్ట్ చేయాలని చూస్తారు. యూజర్లు తమ మనసులోని భావనలను ఈ క్యాప్షన్స్ ద్వారా వ్యక్తం చేస్తుంటారు.
మీరు కూడా మీయొక్క తదుపరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కోసం క్యాచీ, స్టైలిష్, యాటిట్యూడ్ క్యాప్షన్స్ కోసం చూస్తుంటే, ఇక్కడ మీకోసం ఉత్తమమైన క్యాప్షన్స్ లిస్ట్ ని అందిస్తున్నాం. వీటితో మీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఎంతో విభిన్నంగా మరియు ఇతరులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఒకసారి ఇక్కడ మేం అందిస్తున్న క్యాప్షన్స్ చదవండి. మీకు ఏదైనా నచ్చవచ్చు. నచ్చిన వాటిని మీ ఫోటోకి లేదా వీడియోకి జత చేసి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో వాడుకోండి. మీ పోస్ట్ ని మరింత వైరల్ చేసుకోండి.
Instagram తెలుగు ఆటిట్యూడ్ క్యాప్షన్స్
- ప్రపంచం అంతా మన అలవాట్లపై ఫోకస్ పెట్టదు, కానీ ఆటిట్యూడ్‌పై పెడుతుంది.
- సహనంతో ఉండటం తెలుసుకున్నవాడు, దేన్నైనా సాధించగలడు.
- నాకు హృదయం లేదని కాదు, నేను దాని మాట విననంతే!
- పేరు, గుర్తింపు చిన్నవే కావచ్చు, కానీ వాటిని సొంతంగా సాధించామా లేదా అన్నదే ముఖ్యం!
- మాతో పెట్టుకోవడమంటే, మందుగుండుపై కూర్చొని నిప్పుతో చెలగాటమాడటమే!
- నేనెవరో నాకు తెలుసు, జనాలు అనుకునేది నాకనవసరం!
- వీధిలో ఒకరిద్దరికి కూడా తెలియని ప్రతోడూ నా పేరొక్కటి చాలని చెప్పేవాడే
- ఒంటిరిగా నడిచే ధైర్యం ఉన్న వారినే ఏదో ఒక రోజున వేల పాదాలు అనుసరిస్తాయి.
- మీరు సముద్రాలు కాదు పిల్ల కాలువలని చెప్పే రోజు ఒకటి వస్తుంది. వెయిట్ అండ్ సీ.
- అసలు మేం రంగంలోకే దిగలేదు, అప్పుడే జనాలు మా గురించి చర్చ మొదలు పెట్టారు.
- ఇద్దరుముగ్గురు శత్రువులను నేను కేర్ చేయను, నా ఫ్యాన్స్ వేలల్లో ఉన్నారు!
- మాలా ఉండేందుకు ప్రయత్నించకు, సింహాలు పుడుతాయి, తయారవ్వవు.
- మా జీవితాలు కొంచెం తేడా.. మొండితనంపైనే మా జీవితం, నమ్మకంపై కాదు.
- స్ట్రాంగ్ రిలేషన్‌షిప్స్‌కైనా, స్ట్రాంగ్ టీ’కైనా.. కాస్త టైం పడుతుంది.
- ఇవాళ టైమ్ నీదని రెచ్చిపోకు, నా టైమ్ వచ్చినప్పుడు టెంపర్ లేచుద్ది, తట్టుకోలేవ్!
- తెల్లగున్నావని పొగరు చూపీయకు, పాల కంటే చాయ్‌కే ఫ్యాన్స్ ఎక్కువ!
- మ్యాటర్ లేనేడో మాటలు మాట్లాడతాడు, దిమాక్ ఉన్నోడు దూసుకెళ్తాడు!
- మా సత్తా ఏంటో మా మాటలు చెప్పవు, శత్రువుల అరుపులు చెప్తాయి.
- నేను ఎక్కడైనా రాజుని కాగలను, కానీ నీ హృదయాన్ని పాలించడంలో ఉన్న కిక్కే వేరప్పా!
- ఫేమస్ అవ్వట్లేదని నాకు బాధలేదు. ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ చేసినోడు కూడా ఫేమస్ అయిపోతున్నాడు!
- నాలో ఎన్నో లోపాలుండొచ్చు, కనీసం అందులోంచి ఒక పోకిరిని వెతికి తీయి!
- మన కష్టం గొప్పదైతే, విజయం తలవంచక తప్పదు!
- నా జీవితం, నా రూల్స్! నీ నవాబ్‌గిరి నాకాడ చూపీయకు!
- జర్రా ఫ్రెండ్షిప్ చేస్తే ప్రాణమిస్తా, తేడాలొస్తే తేలు లెక్క కుట్టిపారేస్తా!












