మే 23న భారత్ లో లాంచ్ కానున్న Nokia C32

Highlights

  • 7జిబి ర్యామ్ (4జిబి + 3జిబి) తో వస్తోన్న డివైజ్
  • యూజర్‌కి లభించనున్న ఒక ఏడాది రిప్లేస్మెంట్ గ్యారంటీ
  • Nokia C32 ప్రారంభ ధర రూ.9,999 గా ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Nokia త్వరలో భారత్ లో చవకైన స్మార్ట్ ఫోన్ Nokia C32 ని లాంచ్ చేయబోతోంది. ఇటీవలె ఈ సంస్థ Nokia C22ని లాంచ్ చేసింది. తాజాగా 91మొబైల్స్ కి Nokia C32 లాంచ్ సమాచారం అందింది. ఈ ఫోన్ మే 23 న భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. సరే, ఓసారి Nokia C32 కి సంబంధించిన అంచనా స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Nokia C32 ధర

Nokia C32 స్మార్ట్ ఫోన్ ధర భారత్ లో రూ.12,000 లోపు ఉంటుందని అంచనా వేశారు. కానీ, ఈ ఫోన్ ని సదరు సంస్థ రూ.9,999 లోపే తీసుకురానుందని తాజాగా తెలుస్తోంది. అసలు ధర ఎంతో మే 23 న ఫోన్ లాంచ్ తర్వాతే తెలియనుంది. సరే, ఓసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Nokia C32 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • 2.5డి కవర్ గ్లాస్

Nokia C32 ఫోన్ లో 20:9 యాస్పెక్ట్ రేషియో, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, 6.5-హెచ్డీ+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, 2.5డీ గ్లాస్ ఉన్నాయి. ఈ ఫోన్ ఐపీ52 రేటింగ్ కలిగి ఉంది.

ర్యామ్, చిప్సెట్

  • 4జిబి + 3జిబి ర్యామ్
  • యూనిసాక్ ఎస్‌సీ9863ఏ

Nokia C32 లో 4జిబి + 3జిబి ర్యామ్ ఉంటుందని అంచనా. యూనిసాక్ ఎస్‌సీ9863ఏ అనే చిప్సెట్ ని ఈ ఫోన్ లో అందించనున్నారు.

కెమెరా విభాగం

  • 50ఎంపి రియర్
  • 8ఎంపి సెల్ఫీ

Nokia C32 లో 50ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది. రియర్ కెమెరాకి తోడు ఒక 2ఎంపి మ్యాక్రో లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్

  • 5000ఎంఏహెచ్
  • 10వాట్ చార్జింగ్

Nokia C32 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ

కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే, Nokia C32 లో 4జీ ఎల్టీఈ, 3.5ఎంఎం ఆడియో జాక్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి బేసిక్ ఫీచర్లు ఉంటాయి.