
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే భారత్ లో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. వచ్చే నెలలో గ్లోబల్ గా ఈ సిరీస్ లాంచ్ అవుతుందని సమాచారం. తర్వాత భారత్ లోకి ఈ సిరీస్ ప్రవేశించనుంది. వివో వీ29 సిరీస్ లో టాప్ మోడల్ అయిన Vivo V29 Pro గురించి తాజాగా ఓ సమాచారం తెలిసింది. టిప్‌స్టర్ సుదాన్శు Vivo V29 Pro కి సంబంధించిన ఎన్నో స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశారు. ఈ డివైజ్ 12జిబి ర్యామ్, 50ఎంపి సెల్ఫీ కెమెరాతో వస్తున్నట్లు సమాచారం.
వివో వీ-సిరీస్ కి భారత్ లో మాంచి డిమాండ్ ఉంది. దీంతో వివో వీ-సిరీస్ ఫ్యాన్స్ ఈ సిరీస్ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఈ సిరీస్ కి సంబంధించిన అప్డేట్స్ వారిని మరింత ఉత్సాహపరచడం ఖాయమని తెలుస్తోంది. సరే, ఓసారి Vivo V29 Pro స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Vivo V29 Pro స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
- ఓఎల్ఈడీ ప్యానెల్
- 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
Vivo V29 Pro లో 6.7-ఇంచ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. ఇంకా 1080 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
ర్యామ్, స్టోరేజీ
- 12జిబి ర్యామ్
- 256జిబి స్టోరేజీ
Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఇవ్వనున్నారు. అయితే, ఈ డివైజ్ ఒకటి కంటే ఎక్కువ మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుందని సమాచారం.
కెమెరా విభాగం
- 64ఎంపి రియర్ కెమెరా
- 50ఎంపి సెల్ఫీ కెమెరా
Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి ప్రైమరీ సెన్సర్ ఉంటుంది. దీంతో పాటు ఉండే మిగతా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు. ఇకపోతే సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
- 5000 ఎంఏహెచ్
- 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్
Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ గురించి ఇప్పటి వరకు తెలిసిన స్పెసిఫికేషన్స్ ఇంతే. రానున్న రోజుల్లో ఈ డివైజ్ గురించి మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది.











