లీకైన iQOO Z7s 5G డిజైన్ రెండర్స్, ధర; త్వరలోనే లాంచ్!

Highlights

  • భారత్ లో iQOO Z7s 5G ధర రూ.20,000 లోపు ఉండే అవకాశం
  • రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానున్న డివైజ్
  • iQOO Z7s 5G ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ రివీల్ చేసిన టిప్‌స్టర్ సుదాన్శు

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ ని వివిధ మార్కెట్స్ లో లాంచ్ చేయాలని ఐకూ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో ఈ కంపెనీ Z7 సిరీస్ లో పలు ఫోన్లను లాంచ్ చేసింది. త్వరలో ఐకూ కంపెనీ, చైనాలో iQOO Z7s 5G డివైజ్ ని లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ ఫోన్ భారత్ తో పాటు, ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో కూడా లాంచ్ కానుందని సమాచారం.

iQOO Z7s 5G డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అవుతుందని తెలుస్తోంది. కొత్త లీక్ ద్వారా iQOO Z7s 5G డివైజ్ భారత మార్కెట్ ధర, డిజైన్ రెండర్స్ రివీల్ అయ్యాయి. టిప్‌స్టర్ సుదాన్శు అంబోరే iQOO Z7s 5G ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ రివీల్ చేశారు. సరే, ఓసారి iQOO Z7s 5G ధర, స్పెసిఫికేషన్స్, తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో iQOO Z7s 5G ధర, లాంచ్ వివరాలు (రూమర్)

  • 6జిబి+128జిబి = రూ.18,999
  • 8జిబి+128జిబి = రూ.19,999

iQOO Z7s 5G ధర భారత్ లో రూ.20,000 లోపు ఉంటుందని సమాచారం. ఈ డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. iQOO Z7s 5G బేస్ మోడల్ 6జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. దీని ధర రూ.18,999 గా ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్ మోడల్ ధర రూ.19,999 గా ఉండే చాన్స్ ఉందని సమాచారం.

iQOO Z7s 5G డిజైన్, స్పెసిఫికేషన్స్ (రూమర్)

డిస్ప్లే

  • అమోలెడ్ ప్యానెల్
  • 6.38-ఇంచ్ డిస్ప్లే

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో 6.38-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే , 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి.

కెమెరా విభాగం

  • 64ఎంపి రియర్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా

iQOO Z7s 5G రియర్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. టిప్‌స్టర్ అంబోరే ప్రకారం, ఈ ఫోన్ లో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే సెన్సర్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. దీంతో పాటు సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ

  • స్నాప్ డ్రాగన్ 695 5జీ
  • 8జిబి ర్యామ్
  • 128జిబి స్టోరేజీ

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ లో 8జిబి వరకు ర్యామ్ మరియు 128జిబి వరకు స్టోరేజీ ఉండనుంది.

బ్యాటరీ, చార్జింగ్

  • 4500 ఎంఏహెచ్
  • 44 వాట్ చార్జింగ్

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు సమాాచరం.

కనెక్టివిటీ, ఓఎస్

  • 3.5ఎంఎం ఆడియో జాక్
  • ఆండ్రాయిడ్ 13

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ-టైప్ సీ పోర్ట్, వై-ఫై 5, బ్లూటూత్ 5.1 ఉంటాయి. ఈ ఫోన్ 158.91 మిల్లీ మీటర్ల పొడవు, 73.53 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.8 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. ఈ ఫోన్ ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.