లీకైన OnePlus Ace 2 Pro లాంచ్ టైమ్‌లైన్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Ace 2 Pro
  • 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాతో రానున్న డివైజ్
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో వస్తోన్న హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ త్వరలో Ace 2 Pro డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే, దీనికి సంబంధించి వన్ ప్లస్ నుంచి అధికార ప్రకటన రాలేదు. కానీ, ఎన్నో లీక్స్ ద్వారా OnePlus Ace 2 Pro డివైజ్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఇప్పుడు కొత్త లీక్ ద్వారా OnePlus Ace 2 Pro స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ టైమ్ లైన్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 2 Pro లాంచ్ టైమ్‌లైన్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్ (లీక్)

లీక్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, ఈ ఫోన్ జులై-ఆగస్టు నెలల్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ రెడ్మీ కే60 అల్ట్రా ఫోన్ కి సవాలు విసరనుంది.

OnePlus Ace 2 Pro పై ఈ నెల ఆరంభం నుంచి రూమర్లు రావడం ప్రారంభమైంది. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 1.5కే స్క్రీన్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్నట్లు తెలుస్తోంది.

OnePlus Ace 2 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

కెమెరా విభాగం

  • 50ఎంపి రియర్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా

OnePlus Ace 2 Pro స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్

  • 5000 ఎంఏహెచ్
  • 100 వాట్ సూపర్‌వూక్

OnePlus Ace 2 Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించారు.

ఓఎస్

  • ఆండ్రాయిడ్ 13
  • కలర్ఓఎస్ 13

OnePlus Ace 2 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

డిస్ప్లే, చిప్సెట్

  • 1.5కే డిస్ప్లే
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్

OnePlus Ace 2 Pro స్మార్ట్ ఫోన్ లో 1.5కే రెజుల్యూషన్ గల డిస్ప్లే ఉంటుందని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా తెలుస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2చిప్సెట్ వాడినట్లు సమాచారం.

భారత్ లో OnePlus Ace 2 Pro లాంచ్ అయ్యేదెప్పుడు?

OnePlus Ace 2 Pro డివైజ్ భారత మార్కెట్ లాంచ్ గురించి అప్పుడే ఏమీ చెప్పలేం. కానీ, భారత్ లోకి మాత్రం వేరే పేరుతో ప్రవేశించే చాన్స్ ఉంది. OnePlus 11T లేదా OnePlus 11RT అనే పేరుతో OnePlus Ace 2 Pro భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రానుంది.