144Hz డిస్ప్లే, 5080mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Redmi Note 12T Pro

Highlights

  • పెర్ఫామెన్స్ సెంట్రిక్ ఫోన్ గా వస్తోన్న Redmi Note 12T Pro
  • భారత్‌తో పాటు గ్లోబల్ గా Redmi K60i పేరుతో లాంచ్ అయ్యే అవకాశం
  • 5080ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన Redmi Note 12T Pro

షావోమి సబ్ బ్రాండ్ రెడ్మీ చైనాలో Redmi Note 12T Pro డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ 5జీ డివైజ్ పెర్ఫామెన్స్-ఫోకస్డ్ డివైజ్. ఈ స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్ట్రా చిప్సెట్ వాడారు. ఈ డివైజ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. Redmi Note 12T Pro హ్యాండ్సెట్ గ్లోబల్ మార్కెట్స్ లో కే-సిరీస్ కింద లాంచ్ కానుందని సమాచారం. గతేడాది Redmi Note 11T Pro ఫోన్ భారత్ తో పాటు వివిధ మార్కెట్స్ లో Redmi K50i పేరుతో లాంచ్ అయ్యింది.

అయితే Redmi Note 12T Pro డివైజ్ గ్లోబల్ మార్కెట్స్ లాంచ్ గురించి రెడ్మీ ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. సరే, ఓసారి Redmi Note 12T Pro డివైజ్ ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi Note 12T Pro ధర

  • 8జిబి+128జిబి: CNY 1599 (రూ.18,600)
  • 12జిబి+512జిబి: CNY 1999 (రూ.23,300)

Redmi Note 12T Pro డివైజ్ చైనాలో వివిధ ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. బేస్ మోడల్ అయిన 8జిబి+128జిబి వేరియంట్ ధర CNY 1599 (సుమారు రూ.18,600) గా ఉంది. 12జిబి+512జిబి వేరియంట్ ధర CNY 1999 (సుమారు రూ.23,300) గా ఉంది.

Redmi Note 12T Pro స్మార్ట్ ఫోన్ గ్రే, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Redmi Note 12T Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.6-ఇంచ్ డిస్ప్లే
  • ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్

Redmi Note 12T Pro స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, డైనమిక్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డీసీ డిమ్మింగ్, డాల్బి విజన్, గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.

చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ

  • డైమెన్సిటీ 8200 అల్ట్రా
  • 8జిబి, 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్
  • 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ

బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

  • 5080mAh
  • 67W

Redmi Note 12T Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5080 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

కెమెరా విభాగం

  • 64ఎంపి రియర్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా

Redmi Note 12T Pro స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి ఒమ్నివిజన్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ శాంసంగ్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉంది.

ఓఎస్, కనెక్టివిటీ

  • ఆండ్రాయిడ్ 13
  • వై-ఫై 6

Redmi Note 12T Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, స్టీరియో స్పీకర్స్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.