
శాంసంగ్ ఇండియా ఎట్టకేలకు Samsung Galaxy F54 5G డివైజ్ లాంచ్ తేదీని ప్రకటించింది. 2023 జూన్ 6 న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ మరియు శాంసంగ్ అధికార వెబ్ సైట్ ద్వారా ఈ హ్యాండ్సెట్ సేల్ కి వస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy F54 5G ప్రీ-రిజర్వేషన్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy F54 5G ప్రీ-రిజర్వేషన్
- ఫ్లిప్ కార్ట్, శాంసంగ్ వెబ్ సైట్ ద్వారా అందుబాటులోకి Samsung Galaxy F54 5G ప్రీ-ఆర్డర్స్
- ప్రీ-రిజర్వేషన్ కోసం కస్టమర్లు చెల్లించాల్సిన అడ్వాన్స్ అమౌంట్ రూ.999. లాంచ్ తర్వాత ఫైనల్ అమౌంట్ నుంచి తగ్గించబడనున్న రూ.999.
- రూ.2,000 విలువజేసే బెనిఫిట్స్ ని ఆఫర్ చేస్తోన్న కంపెనీ
Samsung Galaxy F54 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే
- 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- అమోలెడ్ డిస్ప్లే
Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ లో అమోలెడ్ డిస్ప్లే, 6.7-ఇంచ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ శాంసంగ్ ఎమ్54 5జీ యొక్క రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని అంటున్నారు. ఈ తరుణంలో, స్పెసిఫికేషన్స్ కూడా ఒకే విధంగా ఉంటాయని భావించవచ్చు.
చిప్సెట్, ఓఎస్
- ఎగ్జినోస్ 1380
- ఆండ్రాయిడ్ 13
Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ వాడినట్లు సమాచారం. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
కెమెరా విభాగం
- 108ఎంపి రియర్ కెమెరా
- 32ఎంపి ఫ్రంట్ కెమెరా
Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. ఇకపోతే, సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ, కనెక్టివిటీ
- 6000 ఎంఏహెచ్
- 5జీ
Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఏఐ ఫేస్ అన్‌లాక్ ఇవ్వనున్నారు. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, వై-ఫై, 5జీ, 4జీ, బ్లూటూత్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.











