అఫీషియల్ గా రివీలైన Nothing Phone (2) డిస్ప్లే సైజ్, బ్యాటరీ కెపాసిటీ!

Highlights

  • 6.7-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న Nothing Phone (2)
  • 4700 ఎంఏహెచ్ బ్యాటరీ తో రానున్న డివైజ్
  • ఇంకా రివీల్ కావాల్సి ఉన్న లాంచ్ తేదీ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ నథింగ్ త్వరలో Nothing Phone (2) డివైజ్ తో మార్కెట్ లోకి రానుంది. నథింగ్ ఫ్యాన్స్ ఈ ఫోన్ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సంస్థ Nothing Phone (2) డివైజ్ జులై లో లాంచ్ కానుందని ప్రకటించింది. ఇకపోతే ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో డెడికేటెడ్ లిస్టింగ్ కూడా కనిపిస్తోంది. Nothing Phone (2) డివైజ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోంది.

తాజాగా Nothing Phone (2) కి సంబంధించిన డిస్ప్లే సైజ్ మరియు బ్యాటరీ కెపాసిటీని నథింగ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2) డిస్ప్లే సైజ్

  • Nothing Phone (2) డిస్ప్లే, Nothing Phone (1) కంటే 0.15 ఇంచులు పెద్దగా ఉంటుందని కంపెనీ ఖరారు చేసింది.
  • 6.55-ఇంచ్ స్క్రీన్ తో వచ్చిన Nothing Phone (1)
  • అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్న Nothing Phone (2)

Nothing Phone (2) బ్యాటరీ

  • Nothing Phone (2) గత మోడల్ కంటే 200ఎంఏహెచ్ అధిక కెపాసిటీతో వస్తోంది.
  • Nothing Phone (1) డివైజ్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో రాగా, Nothing Phone (2) 4700 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.
  • భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, గత మోడల్ కంటే తక్కువ కార్బన్ ఫుట్‌ప్రింట్ 53.45కేజీ ని మాత్రమే కలిగి ఉంది. అంటే Nothing Phone (1) కంటే ఇది 5కేజీ తక్కువ.
  • Nothing Phone (2) లో Nothing Phone (1) కంటే మూడు రెట్లు అధికంగా రీసైకిల్డ్ లేదా బయో-బేస్డ్ కంపోనెంట్స్ ఉన్నట్లు నథింగ్ రివీల్ చేసింది. Nothing Phone (2) డివైజ్ 60 శాతం రీసైకిల్డ్ ఫైబర్ కలిగి ప్లాస్టిక్-ఫ్రీ రిటైల్ ప్యాకేజీతో వస్తోంది.

Nothing Phone (2) సాఫ్ట్‌వేర్ సపోర్ట్

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ 3 ఏళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ పొందుతుందని నథింగ్ సంస్థ ఖరారు చేసింది. గత మోడల్ Nothing Phone (1) కి కూడా ఇదే హామీని నథింగ్ ఇచ్చింది.

Nothing Phone (2) స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే

  • 6.7-ఇంచ్ స్క్రీన్
  • అమోలెడ్ ప్యానెల్

Nothing Phone (2) లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ

  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. ఈ డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది.

కెమెరా విభాగం

  • 50ఎంపి కెమెరా
  • ఓఐఎస్ సపోర్ట్

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది ఓఐఎస్ ఫీచర్ తో వస్తోంది. ఇతర సెన్సర్స్ సమాచారం ఇంకా తెలియదు.