
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ త్వరలో భారత్ లో ఒక కొత్త మొబైల్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. అయితే ఫోన్ ని కంపెనీ లాంచ్ చేయనుందో ఇంకా తెలియలేదు. కానీ, లేటెస్ట్ లీక్ ద్వారా డివైజ్ పేరు, లాంచ్ తేదీ మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. లీక్ ప్రకారం, iQOO Neo 7 Pro డివైజ్ త్వరలోనే భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. సరే, ఓసారి iQOO Neo 7 Pro లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
iQOO Neo 7 Pro ఇండియా లాంచ్ తేదీ (లీక్)
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ iQOO Neo 7 Pro కి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ప్రస్తుతం కచ్చితమైన లాంచ్ తేదీ తెలియలేదు. కానీ, లీక్ ని బట్టి, జూన్ 20 న భారత్ లో iQOO Neo 7 Pro లాంచ్ కానుందని సమాచారం. ఇది గత నెలలో చైనాలో లాంచైన iQOO Neo 8 కి రీబ్రాండ్ వర్షన్ అని వార్తలు వినిపిస్తున్నాయి.
iQOO Neo 7 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: iQOO Neo 7 Pro లో 6.78-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 1260*2800 పిక్సెల్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: iQOO Neo 7 Pro లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు.
- స్టోరేజీ: iQOO Neo 7 Pro లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉండనున్నాయి.
- బ్యాటరీ: iQOO Neo 7 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా విభాగం: iQOO Neo 7 Pro డివైజ్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. మెయిన్ కెమెరా ఓఐఎస్ ఫీచర్ తో వస్తోంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- ఓఎస్: iQOO Neo 7 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- సెక్యూరిటీ: iQOO Neo 7 Pro లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని అందించనున్నారు.











