
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే Realme GT Neo 5 Pro ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. డిజిటల్ చాట్ స్టేషన్ అనే టిప్ స్టర్, రియల్మీ తదుపరి ఫోన్ Realme GT Neo 5 Pro అని వెల్లడించింది. త్వరలోనే ఈ ఫోన్ చైనాలో లాంచ్ కానుందని సదరు టిప్‌స్టర్ తెలిపారు. రెండు రియల్మీ డివైజెస్ చైనాకు చెందిన MIIT సర్టిఫికేషన్ పొందాయి. వీటిలో ఒకటి Realme GT Neo 5 Pro అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
MIIT సర్టిఫికేషన్ పొందిన రెండు స్మార్ట్ ఫోన్లు RMX3820, RMX3823 అనే మోడల్ నంబర్స్ ని కలిగి ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇతర సర్టిఫికేషన్స్ లేదా బెంచ్‌మార్క్స్ వెబ్‌సైట్స్ పై ఈ ఫోన్లు కనిపిస్తే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
Realme GT Neo 5 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే
- ఓఎల్ఈడీ
- 1.5కే రెజుల్యూషన్
Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ ఉంటాయని భావిస్తున్నారు. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండనుంది.
ఓఎస్
- ఆండ్రాయిడ్ 13
- రియల్మీ యూఐ 4.0
Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ
- స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 2
- ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్
Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 2 చిప్ ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
కెమెరా విభాగం
- 50ఎంపి మెయిన్ కెమెరా
- ఓఐఎస్
Realme GT Neo 5 Pro లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది ఓఐఎస్ సపోర్ట్ తో వస్తోంది. ఇతర లెన్సెస్ వివరాలు ఇంకా తెలియలేదు.
చార్జింగ్
- 100వాట్
Realme GT Neo 5 Pro లో భారీ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇకపోతే 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. బ్యాటరీ కెపాసిటీ గురించి ఇంకా తెలియదు. అయితే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని అంచనా వేయవచ్చు. రానున్న రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.











