
X100 సిరీస్ ని లాంచ్ చేసే పనిలో వివో ఉందన్న రూమర్ల మధ్యలో, టిప్‌స్టర్స్ ద్వారా Vivo X90S లాంచ్ గురించి సమాచారం బయటకు వచ్చింది. మరోవైపు మరొక టిప్‌స్టర్ ద్వారా iQOO 11S టైమ్ లైన్ గురించి కూడా హింట్ వచ్చింది. మరి ఈ రెండు ఫోన్లు ఎప్పుడు లాంచ్ కానున్నాయి? టిప్‌స్టర్స్ నుంచి లీకైన సమాచారం ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
Vivo X90S లాంచ్ టైమ్‌లైన్ (రూమర్స్)
చైనీస్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వీబో పై, ఒక టిప్‌స్టర్ Vivo X90S కి సంబంధించిన సమాచారం వెల్లడించారు. దాని ప్రకారం, ఈ డివైజ్ చైనాలో ఈ నెలలోనే లాంచ్ కానుందని సమాచారం. అయితే, కచ్చితమైన తేదీని మాత్రం పేర్కొనలేదు. ఇంకా కంపెనీ నుంచి కూడా అధికార ప్రకటన ఏదీ రాలేదు.
ఎక్స్90 సిరీస్ లో భాగంగా రాబోవు Vivo X90S డివైజ్ లాంచ్ కానుంది. ఇకపోతే ఇటీవలె భారత్ లో Vivo X90 సిరీస్ లాంచ్ అయ్యింది. అయితే, Vivo X90S డివైజ్ భారత మార్కెట్ లోకి వస్తుందో లేదో ఇంకా తెలియదు.
రీసెంట్ గా Vivo X90S స్మార్ట్ ఫోన్ TENAA వెబ్ సైట్ పై కనిపించింది. Vivo X90S డివైజ్ డిజైన్ ఇతర ఎక్స్90 సిరీస్ స్మార్ట్ ఫోన్ల మాదిరే ఉండనుంది.
Vivo X90S స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Vivo X90S లో 6.78-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- రియర్ కెమెరా: Vivo X90S లో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయని అంచనా.
- సెల్ఫీ కెమెరా: సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం Vivo X90S లో 32ఎంపి కెమెరా ఉండే అవకాశం ఉంది.
- చిప్సెట్: Vivo X90S డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ ఉంటుంది. ఇది 3.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది.
- స్టోరేజీ: Vivo X90S స్మార్ట్ ఫోన్ 8జిబి/12జిబి/16జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించే అవకాశం ఉంది.
- ఓఎస్: Vivo X90S స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
- బ్యాటరీ: Vivo X90S స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4590 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.
iQOO 11S లాంచ్ తేదీ (రూమర్స్)
iQOO 11S స్మార్ట్ ఫోన్ జూన్ లేదా జులై మాసాల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వీబో పై టిప్‌స్టర్ షేర్ చేసిన సమాచారం ప్రకారం, iQOO 11S జూన్ 8 న చైనాలో అఫీషియల్ గా లాంచ్ కానుంది. అయితే కంపెనీ దీనిపై అధికార ప్రకటన చేయాల్సి ఉంది.
iQOO 11S స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: iQOO 11S లో 6.78-ఇంచ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండవచ్చు.
- వెనుక కెమెరా: iQOO 11S లో 50ఎంపి మెయిన్ కెమెరా, వీ2 ఐఎస్పీ ఇమేజింగ్ సిస్టమ్ ఉండనున్నాయి.
- చిప్సెట్: iQOO 11S లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుందని సమాచారం. ఇది ఓవర్‌క్లాక్డ్ వర్షన్ అని తెలుస్తోంది.
- స్టోరేజీ: iQOO 11S 8జిబి/12జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
- బ్యాటరీ: iQOO 11S స్మార్ట్ ఫోన్ 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ ఫోన్ ఎంత బ్యాటరీ కెపాసిటీతో వస్తుందో తెలియదు.











