
షావోమి సంస్థ త్వరలోనే కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Redmi 12 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ డివైజ్ కొన్ని రోజుల క్రితం FCC సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. రీసెంట్ గా Redmi 12 ఫోన్ పోర్చుగల్ అధికార వెబ్ సైట్ పై కనిపించింది. కొన్ని రోజుల క్రితం వచ్చిన లీక్ ద్వారా Redmi 12 డివైజ్ జూన్ 2 న గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతుందని తెలిసింది. అయితే అది జరగలేదు. ఇప్పుడు, టిప్‌స్టర్ పారస్ గుగ్లాని NewzOnly ద్వారా Redmi 12 సేల్ తేదీని రివీల్ చేశారు.
Redmi 12 ధర, లభ్యత (అంచనా)
Redmi 12 స్మార్ట్ ఫోన్ ధర 155 డాలర్లు (సుమారు రూ.12,790) గా ఉంటుందని సమాచారం. ఇది 4జిబి+128జిబి బేస్ వేరియంట్ ధర. టిప్‌స్టర్ ప్రకారం, రెడ్మీ 12 సేల్ రానున్న 10 రోజుల్లోపే ఉండనుందని తెలుస్తోంది.
కలర్ ఆప్షన్స్
Redmi 12 కలర్ ఆప్షన్స్ ని కూడా టిప్‌స్టర్ రివీల్ చేశారు. ఈ ఫోన్ బ్లూ, బ్లాక్ మరియు సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. స్కై బ్లూ, మిడ్నైట్ బ్లాక్ మరియు పోలార్ సిల్వర్ అనే అఫీషియల్ మార్కెటింగ్ పేర్లను ఈ కలర్స్ కలిగి ఉండనున్నాయి.
Redmi 12 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Redmi 12 లో 6.79-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సెంటర్డ్ పంచ్-హోల్ నాచ్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi 12 లో మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్, మాలి జీ52 జీపీయూ ని వాడారు.
- మెమొరీ, స్టోరేజీ: Redmi 12 డివైజ్ 4జిబి/8జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.
- సాఫ్ట్‌వేర్: Redmi 12 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Redmi 12 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి ఆగ్జిలరీ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉండనున్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ, చార్జింగ్: Redmi 12 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Redmi 12 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లొనాస్ ఉంటాయి. భద్రత కోసం సైడ్ మైంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.











