
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ నేడు భారత్ లో Realme 11 Pro సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో భాగంగా Realme 11 Pro 5G, Realme 11 Pro+ 5G మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్లు గత నెలలో చైనాలో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు భారత గడ్డపై అడుగు పెట్టాయి. ఈ రెండు మోడల్స్ 5జీ కనెక్టివిటీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకుందాం.
భారత్ లో Realme 11 Pro+ 5G ధర
- Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. ఈ డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.29,999 గా ఉంది.
- Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ సన్‌రైజ్ బీజ్, ఒయాసిస్ గ్రీన్, ఆస్ట్రల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- ఈ ఫోన్ జూన్ 15 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తోంది.
- ఫ్లిప్ కార్ట్, రియల్మీ.కామ్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. Realme 11 Pro+ 5G పై రూ.2,000 డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
Realme 11 Pro+ 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Realme 11 Pro+ 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5జీ చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Realme 11 Pro+ 5G డివైజ్ 8జిబి ర్యామ్+256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్+256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- కెమెరా: Realme 11 Pro+ 5G లో 200 ఎంపి ఓఐఎస్ 4ఎక్స్ లాస్‌లెస్ జూమ్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: Realme 11 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ చార్జర్ తో చాలా తక్కువ సమయంలోనే బ్యాటరీ ఫుల్ చార్జ్ అవుతుంది.
- సాఫ్ట్‌వేర్: Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.











