
వరుస టీజర్ల తర్వాత, ఐటెల్ సంస్థ తన కొత్త ఫోన్ Itel S23 ని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.10,000 లోపే ఉంది. Itel S23 డివైజ్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్, డ్యూయల్-కెమెరా సెటప్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Itel S23 డివైజ్ ఇతర స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
భారత్ లో Itel S23 ధర, లభ్యత
Itel S23 స్మార్ట్ ఫోన్ స్టారీ బ్లాక్ మరియు మిస్టరీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ ధర భారత్ లో రూ.8,799 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ద్వారా జూన్ 14 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ వేరియంట్ (4జిబి వర్చువల్ ర్యామ్) రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా లభించనుంది.
Itel S23 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Itel S23 స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్-డ్రాప్ నాచ్ డిజైన్ ఉన్నాయి.
- కెమెరా: Itel S23 హ్యాండ్సెట్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి సెల్ఫీ కెమెరా ఉంది.
- చిప్సెట్: Itel S23 స్మార్ట్ ఫోన్ లో యూనిఎస్ఓసీ టీ606 ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 ఎంపీ1 జీపీయూ వినియోగించారు.
- ర్యామ్, స్టోరేజీ: Itel S23 డివైజ్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
- సేఫ్టీ: భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.
- బ్యాటరీ, ఓఎస్: Itel S23 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Itel S23 డివైజ్ లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.











