
ఎన్నో లీక్స్, రూమర్ల అనంతరం, షావోమి సబ్-బ్రాండ్ రెడ్మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ Redmi 12 ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ థాయిలాండ్ లో లాంచ్ అయ్యింది. Redmi 12 డివైజ్ 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 550 నిట్స్ బ్రైట్నెస్ తో వచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ తయారు చేసిన ఆక్టాకోర్ చిప్సెట్ వాడారు. Redmi 12 ధర, ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Redmi 12 ధర, లభ్యత
Redmi 12 స్మార్ట్ ఫోన్ మిడ్నైట్ బ్లాక్, స్కై బ్లూ, పోలార్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. Redmi 12 హ్యాండ్సెట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర TBH 5,299 (సుమారు రూ.12,516) గా ఉంది. 4జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ ధరల ప్రకటన రావాల్సి ఉంది. ఈ హ్యాండ్సెట్ ని థాయిలాండ్ లో షాపీ, లజ్దా ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ డివైజ్ గ్లోబల్ లభ్యత గురించి ఇంకా సమాచారం రాలేదు.
Redmi 12 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Redmi 12 లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2460*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 396 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 550 నిట్స్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
- చిప్సెట్: Redmi 12 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Redmi 12 స్మార్ట్ ఫోన్ లో 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
- ఓఎస్: Redmi 12 స్మార్ట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ ఉంటుంది.
- కెమెరా: Redmi 12 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Redmi 12 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సెక్యూరిటీ: భద్రత కోసం Redmi 12 లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐపీ53 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ అందించారు.
- కనెక్టివిటీ: Redmi 12 డివైజ్ లో డ్యూయల్ సిమ్, 4జీ, జీపీఎస్, బ్లూటూత్, ఏఐ ఫేస్ అన్లాక్, ఎన్ఎఫ్సీ ఉన్నాయి.











