
స్మార్ట్ ఫోన్ లాంచెస్ ఉన్నాయంటే ఆ నెల మొత్తం సందడిగా మారిపోతుంది. మొబైల్ లవర్స్ కి కొత్త ఫోన్ల లాంచ్ అనేది ఒక పండుగను తీసుకొచ్చినట్లేనని చెప్పాలి. కొత్త ఫోన్లకు సంబంధించిన లీక్స్ సమాచారం తెలుసుకుంటూ, రూమర్లను విని ఆసక్తిగా ఎదురు చూసే వారికి లాంచ్ సమయం ఎంతో కీలకం. ఇక తమకు నచ్చిన బ్రాండ్ల ఫోన్లు వస్తున్నాయంటే యూజర్లు మరింత ఉత్సాహంతో ఎదురు చూస్తుంటారు.
కొత్త ఫోన్ కొనాలని భావించే వారు మార్కెట్ లోకి బ్రాండ్ న్యూ ఫోన్లు ఎప్పుడు అడుగుపెడతాయా అని వెయిట్ చేస్తుంటారు. ప్రతినెలా ఏదో ఒక కంపెనీ ఫోన్ లాంచ్ అవుతూనే ఉంటుంది. కొన్నిసార్లు మూకుమ్మడిగా ఫోన్లు మార్కెట్ లోకి విడుదలవుతుంటాయి. అప్పుడు ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. రాబోయే జులై నెలలో కూడా పదుల సంఖ్యలో ఫోన్లు లాంచ్ కానున్నాయి. ప్రముఖ బ్రాండ్లైన శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో, మోటోరోలా, వివో, ఐకూ, రియల్మీ లకు చెందిన ఫోన్లు జులై నెలలో మార్కెట్ లోకి రానున్నాయి. ఇక్కడ మీకోసం ఆ ఫోన్ల జాబితాను అందిస్తున్నాం.
జులై లో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్లు
- Motorola Razr 40 – జులై 3
- iQOO 7 Pro – జులై 4
- OnePlus Nord 3 – జులై 5
- OPPO Reno 10 – జులై 7
- Samsung Galaxy M34 – జులై మూడో వారం
- Vivo V29 – జులై చివరి వారం
- Samsung Galaxy Z Fold 5, Flip 5 – జులై చివరి వారం
Motorola Razr 40

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా Motorola Razr 40 డివైజ్ ని జులై నెలలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ ని జులై 3 వ తేదీన మార్కెట్ లోకి విడుదల చేయాలని సదరు సంస్థ భావిస్తోంది.
iQOO 7 Pro
వివో సబ్ బ్రాండ్ అయిన ఐకూ త్వరలోనే iQOO 7 Pro ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ జులై 4 వ తేదీన మార్కెట్ లోకి రానుంది.
OnePlus Nord 3
వన్‌ప్లస్ అభిమానులు OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ డివైజ్ జులై 5 న మార్కెట్ లో లాంచ్ అవుతోంది.
OPPO Reno 10 సిరీస్
OPPO Reno 10 స్మార్ట్ ఫోన్ జులై 7 వ తేదీన మార్కెట్ లో లాంచ్ కానుంది. రెనో సిరీస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రెనో సిరీస్ ఫోన్లు లాంచ్ అవుతున్నాయంటే అందరిలోనూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది.
Samsung Galaxy M34
Samsung Galaxy M34 స్మార్ట్ ఫోన్ 2023 జులై మూడో వారంలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ కోసం శాంసంగ్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Vivo V29
Vivo V29 స్మార్ట్ ఫోన్ జులై చివరి వారంలో లాంచ్ అవుతుందని సమాచారం. ఈ డివైజ్ కోసం వివో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీ-సిరీస్ కి ప్రత్యేకించి భారతీయుల్లో ఎంతగానో ఆదరణ ఉంది.
Samsung Galaxy Z Fold 5, Flip 5
Samsung Galaxy Z Fold 5, Flip 5 స్మార్ట్ ఫోన్లు జులై చివరి వారంలో లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్ల కోసం శాంసంగ్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.






![Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/10/Best-camera-phones-under-25k-oct-218x150.jpg?tr=q-70)
![Best performing phones: రూ.20,000 లోపు బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/10/Best-performing-phones-under-20k-sep-2024-218x150.jpg?tr=q-70)
![Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/09/Fastest-charging-phones-under-25k-218x150.jpg?tr=q-70)








