లీకైన Samsung Galaxy A25 5G ఇమేజెస్; రివీలైన డిజైన్!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A25 5G
  • తాజాగా లీకైన Galaxy A25 5G ఇమేజెస్
  • డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలోనే ఏ-సిరీస్ లో ఒక బడ్జెట్ మొబైల్ ఫోన్ లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. Galaxy A25 5G పేరుతో లాంచ్ కాబోయే ఈ స్మార్ట్ ఫోన్ 6.44-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 64ఎంపి రియర్ కెమెరా, 24ఎంపి ఫ్రంట్ కెమెరాతో, 5100 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇమేజెస్ తాజాగా నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఫోన్ డిజైన్ రివీల్ అయ్యింది. సరే, ఓసారి Galaxy A25 5G డిజైన్ ఎలా ఉందో తెలుసుకుందాం.

Samsung Galaxy A25 5G రెండర్ ఇమేజెస్ (లీక్)

ఫ్రంట్ డిజైన్: Samsung Galaxy A25 5G స్మార్ట్ ఫోన్ ఫ్రంట్ ప్యానెల్ ని గమనిస్తే ఇందులో యు షేప్డ్ నాచ్ డిజైన్ ఉంది. స్క్రీన్ ని చూస్తే, మూడు వైపులా బెజెల్స్ కనిపిస్తున్నాయి. బాటమ్ లో మందపాటి చిన్ ఉంది. ఫ్రంట్ ప్యానెల్ స్క్రీన్ పై టాప్ లో స్పీకర్ ఉంది. ఫోన్ ఎడ్జెస్ ని గమనిస్తే కర్వ్డ్ గా ఉన్నాయి.

బ్యాక్ డిజైన్: Samsung Galaxy A25 5G స్మార్ట్ ఫోన్ రియర్ ప్యానెల్ ఫ్లాట్ గా ఉంది. బ్యాక్ ప్యానెల్ పై మూడు కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. ఈ మూడు లెన్సెస్ వర్టికల్ గా అమర్చబడి ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. బాటమ్ లో శాంసంగ్ బ్రాండింగ్ కనిపిస్తోంది. లీకైన ఫోటోస్ ని గమనిస్తే, ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్ పై బిల్డ్ అయినట్లు తెలుస్తోంది.

సైడ్ డిజైన్: Samsung Galaxy A25 5G స్మార్ట్ ఫోన్ లో కుడివైపు ప్యానెల్ పైన పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ ఉన్నాయి. ఈ పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఎంబెడ్ అయి ఉంది. ఎడమవైపు ప్యానెల్ పై సిమ్ కార్డ్ స్లాట్ ఉంది. ఇంకా బాటమ్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంది. బాటమ్ లో ఎడమ వైపున 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంది. కుడివైపున స్పీకర్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 162 మి.మీ పొడవు, 77.5 మి.మీ వెడల్పు, 8.3 మి.మీ మందం ఉంటుంది.

Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • 6.44-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700
  • 64ఎంపి రియర్ కెమెరా
  • 24ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 5100 ఎంఏహెచ్ బ్యాటరీ

డిస్ప్లే: Samsung Galaxy A25 5G స్మార్ట్ ఫోన్ లో 6.44-ఇంచ్ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A25 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ ఉండవచ్చు.

ఓఎస్: Samsung Galaxy A25 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఫ్రంట్ కెమెరా: Samsung Galaxy A25 5G స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 24 మెగా పిక్సెల్ కెమెరా ఉండవచ్చు.

రియర్ కెమెరా: Samsung Galaxy A25 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. దీనికి తోడు 12ఎంపి కెమెరా, 8ఎంపి కెమెరా కూడా ఉంటాయి.

బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా తెలియలేదు.

Previous articleSnapdragon 4 Gen 2 చిప్‌తో లాంచైన Redmi Note 12R
Next articleసర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో లిస్టైన Vivo Y27 5G; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.