
భారతీయ మార్కెట్ లో ఇన్ఫినిక్స్ సంస్థ ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Infinix Hot 30 5G పేరుతో వస్తోన్న ఈ డివైజ్ జులై 14 న లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. లో-బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. ఈ ఫోన్ 14 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఫోన్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
Infinix Hot 30 5G ఇండియా లాంచ్
Infinix Hot 30 5G డివైజ్ జులై 14 న భారత్ లో లాంచ్ అవ్వనుందని కంపెనీ ప్రకటించింది. వర్చువల్ ఈవెంట్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించనుంది. ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా Infinix Hot 30 5G సేల్ కి రానుంది. ఫోన్ లాంచ్ కార్యక్రమాన్ని కంపెనీ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా కూడా చూడవచ్చు.
భారత్ లో Infinix Hot 30 5G ధర
లాంచ్ తేదీతో పాటు Infinix Hot 30 5G ధరపై కూడా కంపెనీ నుంచి హింట్ వచ్చింది. రూ.15,000 లోపు ధరతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని కంపెనీ తెలిపింది. Infinix Hot 30 5G డివైజ్ రెండు లేదా అంతకంటే ఎక్కువ మెమొరీ వేరియంట్స్ లో రానుంది. అరోరా బ్లూ, నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.
Infinix Hot 30 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Infinix Hot 30 5G లో పంచ్-హోల్ కటౌట్, 580 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి. డిస్ప్లే సైజ్ ఇంకా తెలియదు.
- ప్రాసెసర్: Infinix Hot 30 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడానున్నట్లు సమాచారం. ఇదొక ఆక్టా-కోర్ చిప్.
- ఓఎస్: Infinix Hot 30 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు సమాచారం.
- ర్యామ్: Infinix Hot 30 5G ఫోన్ 8జిబి ర్యామ్ తో లాంచ్ కానుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉండటం విశేషం. యూజర్ కి 8జిబి + 8జిబి అంటే 16జిబి ర్యామ్ లభించనుంది.
- కెమెరా: Infinix Hot 30 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, సెకండరీ లెన్స్ ఉంటాయి.
- 5జీ బ్యాండ్: Infinix Hot 30 5G స్మార్ట్ ఫోన్ 14 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బ్యాండ్స్ ఎయిర్టెల్, జియో 5జీ సర్వీస్ పై బాగా పని చేస్తాయి.
- బ్యాటరీ: Infinix Hot 30 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











