
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో గ్లోబల్ గా Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. తాజాగా టిప్‌స్టర్ పారస్ గుగ్లాని (@passionategeekz) Vivo Y27 5G డివైజ్ రెండర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో డివైజ్ యొక్క కలర్ ఆప్షన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఈ టిప్‌స్టర్ ఇంకా స్పెసిఫికేషన్స్ కూడా లీక్ చేశారు.
రెండర్స్ ద్వారా రివీలైన Vivo Y27 5G డిజైన్, కలర్స్
ఈ నెలలోనే Vivo Y27 5G లాంచ్ కానుందని టిప్‌స్టర్ PassionateGeekz ద్వారా తెలిసింది. టిప్‌స్టర్ నుంచి హై రెజుల్యూషన్ రెండర్స్ లీక్ అయ్యాయి. వీటి ద్వారా కలర్ ఆప్షన్స్ బయటకు వచ్చాయి. ఒబ్సిడియన్ బ్లాక్, స్టార్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ రెండర్స్ లో కనిపించాయి. ఒబ్సిడియన్ బ్లాక్ వేరియంట్ సిల్క్ మ్యాట్ ఫినిషింగ్ తో వస్తోందని తెలుస్తోంది. పుర్పుల్ మోడల్ అయితే మిరుమిట్లు గొలిపే అరోరా ఫినిషింగ్ తో మల్టీ కలర్ లుక్ తో కనిపిస్తోంది.
Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ రౌండెడ్ బాక్సీ బాడీని కలిగి ఉంది. బ్యాక్ ప్యానెల్ పై స్క్రేర్ షేప్డ్ డ్యూయల్-కెమెరా యూనిట్ ఉంది. ఇందులో కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. ఇదే తరహా కెమెరా మాడ్యూల్స్ ఇదివరకు ఒప్పో, వన్‌ప్లస్ బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్లలో కనిపించాయి. మాడ్యూల్ లో రెండు భారీ కెమెరా కటౌట్స్, ఒక సర్క్యులర్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. డివైజ్ కి ఎడమవైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. Vivo Y27 5G కి ముందు వైపున వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో కూడిన డిస్ప్లే ఉంది.
Vivo Y27 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- చిప్సెట్: Vivo Y27 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 5జీ ప్రాసెసర్ వాడినట్లు సమాచారం.
- ర్యామ్, స్టోరేజీ: Vivo Y27 5G లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వస్తుండటం విశేషం.
- కెమెరా: Vivo Y27 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Vivo Y27 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: ఈ ఫోన్ లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.











