
ఎన్నో లీక్స్, రూమర్స్ తర్వాత ఎట్టకేలకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన Vivo Y27 5G డివైజ్ ని లాంచ్ చేసింది. పూర్తి స్పెసిఫికేషన్స్ ని తన గ్లోబల్ వెబ్ సైట్ లో లిస్ట్ చేసింది. ప్రధాన స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే, Vivo Y27 5G లో 6.64-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్-నాచ్ ఉన్నాయి. ఈ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. Vivo Y27 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 8ఎంపి సెల్ఫీ కెమెరాను ఈ ఫోన్ లో అందించారు.
Vivo Y27 5G ధర, లభ్యత
Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ మిస్టిక్ బ్లాక్ మరియు శాటిన్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అయితే Vivo Y27 5G డివైజ్ ధరను ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. ఈ నెలలోనే భారత్ లో Vivo Y27 4G లాంచ్ కానుందని సమాచారం. అయితే ఇంకా ఈ ఫోన్ అనౌన్స్ కావాల్సి ఉంది.
Vivo Y27 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
డిస్ప్లే: Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ లో 6.64-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (2388*1080), వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.
ర్యామ్, స్టోరేజీ: Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ లో 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 128జిబి స్టోరేజీకి పెంచుకోవచ్చు.
చిప్సెట్: Vivo Y27 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్.
ఓఎస్: Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కెమెరా: Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Vivo Y27 5G లో డ్యూయల్ సిమ్, 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో, ఓటీజీ సపోర్ట్ ఉన్నాయి.











