లాంచ్‌కి ముందు లీకైన OPPO Find X7 Pro, OnePlus 12 డిస్ప్లే, చార్జింగ్ స్పెసిఫికేషన్స్!

Highlights

  • ఈ ఏడాది లాంచ్ కానున్న OPPO Find X7 Pro, OnePlus 12
  • 2k కర్వ్డ్ డిస్ప్లేతో వస్తోన్న రెండు డివైజెస్
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 తో వస్తోన్న OnePlus 12

ఈ ఏడాది ఏదైనా సమయంలో OPPO Find X7 Pro, OnePlus 12 డివైజెస్ లాంచ్ కానున్నాయని సమాచారం. అయితే లాంచ్ కి చాలా రోజుల ముందు ఈ రెండు ఫోన్లుక సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ప్రస్తుతం డిస్ప్లే మరియు చార్జింగ్ వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఒక రీసెంట్ రిపోర్ట్ ప్రకారం, OnePlus 12 స్మార్ట్ ఫోన్ లో పెరిస్కోప్ కెమెరా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానుందట. ఇందులో 50ఎంపి + 50ఎంపి + 64ఎంపి సెన్సర్స్ ఉంటాయని తెలుస్తోంది.  సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

  • రీసెంట్ లీక్స్ ద్వారా, OPPO Find X7 Pro, OnePlus 12 ఫోన్ల డిస్ప్లే స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
  • రెండు ఫోన్లు కూడా కర్వ్డ్ 2కే స్క్రీన్, హై ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, స్లిమ్ బెజెల్స్ కలిగి ఉంటాయని సమాచారం.
  • అలాగే OPPO Find X7 Pro డివైజ్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు సమాచారం.
  • మరోవైపు OnePlus 12 స్మార్ట్ ఫోన్ 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రిపోర్ట్ ప్రకారం, ఒక మూడు స్మార్ట్ ఫోన్లు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో రానున్నాయని సమాచారం. వీటిలో 2 స్మార్ట్ ఫోన్లు ఒప్పో మరియు వన్‌ప్లస్ ఫోన్లను ఒక ట్విట్టర్ యూజర్ గుర్తించారు.

OnePlus 12 స్పెసిఫికేషన్స్

  • 50ఎంపి + 50ఎంపి + 64ఎంపి కెమెరా
  • పెరిస్కోప్ లెన్స్
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్
  • అడ్రెనో 750 జీపీయూ
  • 6.7-ఇంచ్ డిస్ప్లే
  • క్యూహెచ్డీ ప్యానెల్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

కెమెరా: ఒక రీసెంట్ రిపోర్ట్ ప్రకారం, OnePlus 12 స్మార్ట్ ఫోన్ లో పెరిస్కోప్ కెమెరా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానుందట. ఇందులో 50ఎంపి + 50ఎంపి + 64ఎంపి సెన్సర్స్ ఉంటాయని తెలుస్తోంది.

చిప్సెట్: OnePlus 12 డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ తో రానున్నట్లు సమాచారం.

డిస్ప్లే: OnePlus 12 డివైజ్ లో 6.7-ఇంచ్ క్యూహెచ్డీ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది.

Previous article6.64-ఇంచ్ Full HD+ డిస్ప్లే, Dimensity 6020 చిప్‌తో లాంచైన Vivo Y27 5G
Next articleSnapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న iQOO 12 5G; లీకైన స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.