
iQOO కంపెనీ ఇటీవలి కాలంలో వరుసగా ఫోన్లను లాంచ్ చేస్తూ పోతోంది. అలాగే ఈ బ్రాండ్ పై కూడా యూజర్లలో మంచి నమ్మకం ఏర్పడింది. ఈ సంస్థ నుంచి ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని జనాలు ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా ఐకూ కంపెనీ, iQOO 11S డివైజ్ ని చైనాలో లాంచ్ చేసింది. దాంతో పాటు, iQOO 12 ని కూడా లాంచ్ చేసేందుకు ఐకూ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సరే, ఓసారి iQOO 12 గురించి లీకైన సమాచారం ఏంటో తెలుసుకుందాం.
టిప్‌స్టర్ ద్వారా లీకైన iQOO 12 వివరాలు
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా iQOO 12 కి సంబంధించిన సమాచారం లీకైంది. తొలుత iQOO 12 డివైజ్ చైనాలో లాంచ్ అవుతుందని తర్వాత, ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇస్తుందని టిప్‌స్టర్ ద్వారా తెలిసింది. ఇంకా లాంచ్ తేదీ ఖరారు కాలేదు. కానీ, ఈ ఏడాది ఆఖర్లో లాంచ్ ఉంటుందని భావిస్తున్నారు. iQOO 12 స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది. 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ రానుంది. ఇంకా 2కే రెజుల్యూషన్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
iQOO 12 స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: iQOO 12 లో అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. అయితే డిస్ప్లే సైజ్ ఎంతో ఇంకా తెలియదు.
- ప్రాసెసర్: iQOO 12 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తుందని తెలుస్తోంది. అక్టోబర్ లో ఈ ఫ్లాగ్షిప్ చిప్పెట్ లాంచ్ కానుంది.
- స్టోరేజీ: iQOO 12 డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తుందని సమాచారం. లాంచ్ సమయంలోనే మోడల్స్ రివీల్ కానున్నాయి.
- కెమెరా: iQOO 12 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఇతర కెమెరా సెన్సర్స్ వివరాలు తెలియదు.
- బ్యాటరీ: iQOO 12 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ లేదా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చు.
- ఓఎస్: iQOO 12 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: iQOO 12 లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ తదితర అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.











