
తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందించే ఫోన్లను లాంచ్ చేస్తూ యూజర్లలో మంచి పేరు సంపాదించింది ఇన్ఫినిక్స్ సంస్థ. ఓవైపు పెద్ద కంపెనీలు ఎక్కువ ధరలో 5జీ ఫోన్లను లాంచ్ చేస్తుంటే, ఇన్ఫినిక్స్ మాత్రం తక్కువ బడ్జెట్ లో 5జీ డివైజెస్ ని తీసుకొస్తూ అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకుంటోంది. సరే, ఓసారి Infinix Hot 30 5G పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.
Infinix Hot 30 5G ధర
ఇన్ఫినిక్స్ సంస్థ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో Infinix Hot 30 5G ని లాంచ్ చేసింది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499 గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.13,499 గా ఉంది. జులై 18 నుంచి ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా, యాక్సిస్ బ్యాంక్ కార్డ్ పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.
Infinix Hot 30 5G డిజైన్
ఫోన్ డిజైన్ గురించి మాట్లాడితే, సూపర్బ్ అట్రాక్టివ్ లుక్ తో ఫోన్ వస్తోందని కంపెనీ తెలిపింది. బ్యాక్ ప్యానెల్ పై భారీ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. రెండు సర్క్యులర్ కెమెరా సెన్సర్స్ ఉంటాయి. ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంటుంది. Infinix Hot 30 5G డివైజ్ బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ ఐపీ53 రేటింగ్, స్ప్లాష్ ప్రూఫ్ తో వస్తోంది. పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉంది.
Infinix Hot 30 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Infinix Hot 30 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 580 నిట్స్ బ్రైట్నెస్, పంచ్-హోల్ డిజైన్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Infinix Hot 30 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ ఉంది.
- స్టోరేజీ: Infinix Hot 30 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా ర్యామ్ ని 16జిబి వరకు పెంచుకోవచ్చు.
- కెమెరా: Infinix Hot 30 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Infinix Hot 30 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Infinix Hot 30 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Infinix Hot 30 5G లో బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ సిమ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్సీ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ 14 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.











