
అమెజాన్ ప్రైమ్ డే 2023 సేల్ మరియు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ స్పెషల్ సేల్స్ లో భాగంగా స్మార్ట్ఫోన్లపై మంచి డీల్స్ వచ్చాయి. iQOO Neo 7 Pro, iQOO 11 5G, Samsung Galaxy M34 తదితర ఎన్నో ఫోన్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్, రియల్మీ, షావోమి బ్రాండ్స్ ఫోన్లపై కూడా డీల్స్ ని మనం గమనించవచ్చు. సరే, మీరు గనుక ఐఫోన్ కొనాలని భావిస్తుంటే ఇదే మంచి సమయం. ఎందుకంటే, iPhone 12, iPhone 13 డివైజెస్ పై మంచి డీల్స్ వచ్చాయి.
రూ.52,499 ధరకి అమెజాన్ లో iPhone 12 ని సొంతం చేసుకోవచ్చు. మరోవైపు iPhone 13 ని ఫ్లిప్ కార్ట్ లో రూ.56,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆర్టికల్ లో రెండు డీల్స్ లో ఏది ఉత్తమమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
iPhone 12, iPhone 13 ఆఫర్ వివరాలు
అమెజాన్ లో ప్రస్తుతం iPhone 12 ధర రూ.53,999 గా ఉంది. ఇది 64జిబి వేరియంట్. ఈ ఫోన్ రెడ్, బ్లాక్, బ్లూ, గ్రీన్, పర్పుల్, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. దీనికి తోడు, యూజర్లు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ పై రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.52,999 కి తగ్గుతుంది. ఇక ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా ఫోన్ కొంటే ధర రూ.52,499 కి చేరుతుంది.
మరోవైపు, iPhone 13 డివైజ్ 128జిబి మోడల్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.57,999 గా ఉంది. ఈ ఫోన్ రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్, పింక్ మరియు స్టార్‌లైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇక బ్యాంక్ ఆఫర్స్ చూద్దాం. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.1000 డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఫోన్ ధర రూ.56,999 కి లభించనుంది. ఇంకా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొంటే రూ.2,900 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.55,099 కి చేరుతుంది.
iPhone 12 vs iPhone 13 స్పెసిఫికేషన్స్, పోలిక

రెండు ఫోన్ల మధ్య ధరలో రూ.5,000 వ్యత్యాసం ఉంది. మరి రెండు మోడల్స్ లో ఉన్న హెచ్చుతగ్గులేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పైన టేబుల్ లో కనిపిస్తున్న విధంగా, iPhone 13 లో అప్‌గ్రేడ్ కాబడిన ప్రాసెసర్ ఉంది. అలాగే భారీ బ్యాటరీ, రెట్టింపు స్టోరేజీ ఉన్నాయి. ఎస్ఈ వేరియంట్ కాకుండా రెగ్యులర్ సైజ్ ఐఫోన్ ని వాడాలనుకుంటే వారికి iPhone 12 బెస్ట్ ఆప్షన్ అవ్వవచ్చు. అయితే, ధరని బట్టి చూస్తే, iPhone 13 బెటర్ వాల్యూని అందిస్తుంది. అంతేకాదు, ఎక్కువ స్టోరేజీ ఈ ఫోన్ లో లభిస్తోంది. ఈరోజుల్లో స్టోరేజీ ప్రాధాన్యత ఏంటో మీకు తెలిసిందే.
ఇక మీరు గనుక టైట్ బడ్జెట్ లో ఉంటే, అదనంగా రూ.5,000 పెట్టలేకపోతే, అప్పుడు iPhone 12 కి వెళ్తే మంచిది. లేదంటే iPhone 13 ని ఎంచుకోండి.











